నాన్న నాతోనే!; - సుమ
 పెళ్లయిపోయింది.అప్పగింతల సమయం ఆసన్నమైంది.
సుజాత అల్లుడితో " దివ్య తండ్రి లేని పిల్ల. పొరపాటు చేస్తే సర్దుకొండి బాబూ"అంది జీరబోయిన స్వరంతో.
"తండ్రి లేని లోటు తెలియకుండా నేను చూసుకుంటాను అత్తయ్య గారూ" అల్లుడు మాటిచ్చేసాడు.
"నాన్న లేరని ఎందుకు అంటున్నావమ్మా? నాన్న ఎప్పుడూ నాతోనే ఉన్నారు.నా ప్రతి అడుగు ఆయన ఉన్నారన్న ధైర్యం తోనే పడుతుంది. మరోసారి అలా ఎవరితో అనకు" అంటూ ఆత్మవిశ్వాసం తో భర్త వెనుక అడుగులు వేసింది దివ్య.
 భరోసా!
-----------------
చిన్నప్పటి నుండి నాన్నంటే నాకు ప్రాణం. నాకు మా నాన్నే రోల్ మోడల్.
ఉన్నట్లుండి ఆయన నా ప్రపంచం నుండి అందనంత దూరంలోకి వెళ్ళిపోయారు.
అంతా చీకటి…
అమ్మ కోసం నవ్వు పులుముకుందాం అనుకున్నా సాధ్యపడడం లేదు.
"చిన్నా! నేను ఎక్కడకూ వెళ్ళలేదు. అనుక్షణం నీతోనే ఉంటాను. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు.నీ నవ్వు లో నేనుంటాను." అన్న నాన్న మాట చెవిలో వినిపించింది.
అంతే! నా పెదవులపై మా నాన్న ఉన్నారు అనే భరోసా!

కామెంట్‌లు