ఎదురీత..!!----సరళ శ్రీ లిఖిత - సికిందరాబాద్

 కష్టం వచ్చిందని 
కుమిలి పోకు!
కాలం కలిసి రాలేదని
కన్నీరు పెట్టకోకు!
కోరుకున్నది చేరలేదని
చేరువైనది వదలకోకు!
అలుపు ఎరుగని 
జీవితం ప్రయాణం లో,
మలుపుకో ---
మజిలీ అయినా,
ప్రాణం నిలిచిపోయే.-
గమ్యం చేరే వరకే
ఈ ప్రయాణం....!
మంచి,-చెడు 
వివేకం-,విచక్షణా
నేర్పు,ఓర్పు
గెలుపు,-ఓటమి....
కలయికే ఈ జీవితం..!
ఏది ఏమైనా,
ఈ సంసారసాగరంలో,
ఎదురీత అనేది
తప్పదుగా. మరి.!!
          ....‌సరళ శ్రీ లిఖిత!!
కామెంట్‌లు