కుటుంబమే పునాది;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ఒకవైపు ఉమ్మడి కుటుంబాలే వద్దంటూ గుమ్మడి కాయ కొట్టేస్తుంటే...
మరోవైపు చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలంటూ
నవ తరాలు నగర బాట పట్టేస్తుంటే...
సనాతన సంప్రదాయాలతో పూర్తిగా సత్ సంబంధాలు తెగిపోతుంటే....
సొమ్ముల కుమ్ములాటలో కనిపించని స్వార్ధాలు పెరిగిపోతుంటే....
"నా" అన్న పదం ముందు "మన" అన్న బంధుత్వాలు విడిపోతుంటే....
చెడుతో పోటి పడి మంచి ఓడిపోతుంటే....  
మానవత్వాన్ని మరిచి పోతున్న మనుషులలో
క్రూరత్వం పురుడు పోసుకుంటే...
విడిన, చెడిన, విలువలేని వ్యక్తిత్వాలే రాజ్య మేలుతుంటే...
మిన్ను నంటుతున్న సమాజ మేడలు కూలకుండా వుండాలంటే....
మన్ను నంటిన స్థిరమైన కుటుంబ గోడలు పునాదులుగా మారాలి...


కామెంట్‌లు