బడి బాట -సమ్మోహనాలు ;-యం. వి. ఉమాదేవి
(709-706)

బడిబాట సాగింది 
సాగిమరి మురిసింది 
మురిసేను బడిగంట తరగతియు ఓ వనజ !

ప్రార్థనకు కూడితిరి 
కూడి మరి పాడితిరి
పాడితిరి జాతీయ గీతాలు ఓ వనజ !

సీతాకోక చిలుక 
చిలుక రెక్కలు కులక 
కులికేరు బాలలే బడిలోన ఓ వనజ !

ఏకరూప దుస్తులు 
దుస్తులతో పిల్లలు 
పిల్లలట పాఠాలు మొదలెట్టునిక వనజ !

క్రొత్తవి  పుస్తకాలు 
పుస్తకముకు అట్టలు 
అట్టలను సరదాగ వేసితిరి మరి వనజ !

గొంతెత్తి చదివారు 
చదివి గుర్తించారు 
గుర్తుగా ఉండాలి పాఠమే కద వనజ !

మధ్యాహ్న భోజనం
భోజనమగుక్రమము
 క్రమముగా ముగిసింది క్యూలైను ఓ వనజ !


కామెంట్‌లు