అహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "నేనే గొప్ప  నాకంతా తెలుసు. మిగతా వారంతా నాముందు దిగదుడుపే "అనే అహంకారం  దురభిమానం  ఎవరికీ పనికిరాదు. ఎవరి ప్రతిభ ప్రత్యేకత వారిదే!ఇంకోరితో పోల్చుకోవడం  బాధ పడటం కించపడటం తగదు.మనచేతివేళ్లు సమానంగా ఉంటే మనం పనులు చేయలేము.వస్తువులు పట్టుకోలేము.ప్రకృతినేర్పే పాఠం కూడా ఇదే! సాధారణంగా ఓచెట్టు మొక్కలో ఏభాగాన్ని చూసి మనం ఆకర్షింప బడతాం!?పువ్వుల్ని చూసేకదా? రకరకాల రంగులు వాసనలతో ఉండే ఆపూలలోకూడా  కొన్నిటికే మనం ప్రాధాన్యత ఇస్తాము.మల్లెల గులాబీ లంటే మహాఇష్టం అందరికీ! అదిగో! అక్కడ ఓపెద్ద చెట్టుకి నిండా పసుపు రంగుపూలు లేలేత ఎర్ర చిగుర్లు పెద్ద ఆకులు  ఆబాటపై వెళ్లే ప్రతివారినీ పలకరిస్తున్నాయి.ఇంకో వింత ఏమంటే  తెల్లని మొగ్గలు  క్రమంగా పసుపువన్నె పూలుగా విచ్చుకుని ఆపై ఎరుపురంగులోకి మారుతున్నాయి.కానీ వాటిని కోయగానే వాడిపోయి నల్లటి నలుపుగా మారటంతో చెత్త కుప్పపై పారేస్తున్నారు.ఓవ్యక్తి కాసేపు  చెట్టుకింద  విశ్రాంతి తీసుకుని నడకప్రారంభించాడు. ఆచెట్టు పువ్వు  ఆకు అతని వెంట నడవసాగాయి.పూవు అడిగింది "ఏంమిత్రమా! ఓపత్రమా! నీవు ఎర్ర లేతచిగురు ఆపై ఆకుపచ్చ రంగులో మారావు.మరి ఇప్పుడేంటి? పసుపు వన్నె లో పాలిపోయి నీరసంగా ఉన్నావు?నేను చూడు మొగ్గదశనుంచి ఇప్పటిదాకా  ఎన్నో రంగుల్లో మారి  నవనవలాడుతున్నానో? ముసలితనం ముంచుకొచ్చిందానీకు?" ఆహేళనకి ధాటీగా ఆకు ఇలా అంది" నేను రాలినా జనాలకి ఉపయోగ పడితే చాలు! నీరంగు రూపం తాత్కాలికంసుమా! నీవు నలిగినా వాడినా చెత్త కుప్పపై పారేస్తారు.నేను  ఎండినా విస్తరి కుట్టి వాడుతారు"."నాకు  వర్తమానం పై విశ్వాసం ఎక్కువ. నాపూలగుత్తిని చెంపకి ఆనించుకుని ఫోటో దిగుతారు."గర్వంగా అంది పూవు.ఇంతలో హఠాత్తుగా సుడిగాలి లేచింది. పూవు నేలపై రాలింది.వడివడిగా నడిచే ఆవ్యక్తి పాదాలకింద పూవు నలిగింది.దూరంగా కింద పడిన  ఆకుని తీసి తన చేతిలోని పళ్ళు  అందులో పెట్టి దారంతో చుట్టి  నడకసాగించాడు.ఆకుమాత్రం "అయ్యో పువ్వా! మధ్యలోనే అసువులు  బాసావా?" అని జాలిగా కన్నీరు విడిచింది🌹
కామెంట్‌లు