ఉండాలి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 వానలు తరచు కురవాలి
నీరు గలగల పారాలి
సెలయేరు అందంగా ఉండాలి
చిగురాకు తొడగాలి
చెట్టుచేమ అందంగా ఉండాలి
ప్రకృతి పచ్చగా మెరవాలి
వసుధ అందంగా ఉండాలి
కోకిలమ్మ కూయాలి
ఆ పాట తీయగా ఉండాలి
ప్రాణికోటి ఆనందంగా ఉండాలి !!

కామెంట్‌లు