దీపం (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పెనుచీకటిలో
వెలిగిన దీపం
దేహము దాల్చిన
దేవుని రూపం
కంటికి ఇంటికి 
మా కున్న దీపం
పాల కడలిలో
వెలిగిన దీపం
రాగ జగతిలో
రంగుల దీపం
వెన్నెల మామకు
కన్నుల దీపం
మా మనసులలో
వెలుగులు నింపే 
వయ్యారి దీపం
జేజ దీపం !!

కామెంట్‌లు