ఎర్రెర్రని సూరీడు
మబ్బుల్ని చీల్చాడు
కర్రెద్దు బండి వాడు
ఎర్ర జెండ చూపాడు
మర్రిచెట్టు తొర్ర చూడు
ఎర్రజెర్రి సొగసు చూడు
కుర్ర చేష్టలను వీడు
గుర్రపు స్వారి చూడు
గొర్రెకు తోక బెత్తెడు
బర్రెల పాలు బలమిడు
నాగలి కర్రును చూడు
పదును మెండుగ నుండు
బొర్రా గుహలను చూడు
బహు విచిత్రముగ నుండు
జర్రిపోతు చూడరా
జర జరా పాకురా
ముర్రుపాలు బలమురా
జుర్రుకొని త్రాగుమురా
ముర్రా జాతి గేదెలు
ముచ్చటైన గేదెలు
కర్ర స్వాము మంచిది
కష్టాల నేస్తమది
=================
గుండాల నరేంద్రబాబు
తెలుగు పరిశోధకులు
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
తేది:24-06-2022
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి