"ఏంటి సార్?మీమనవడ్ని ఇంజనీరింగ్ లో చేర్పించలేదా?మంచి రాంక్ వచ్చింది కదా?" ఇరుగు పొరుగు వారి ప్రశ్నకి తాత జవాబు ఇది" నాయనా!ఇది పోటీప్రపంచం!కళ్ళు ఒళ్లు గుల్ల!విదేశాలకి ఎగిరి పోయి పైన పటారం లోన లొటారం బతుకుతో గడుపుతున్నారు చాలా మంది! ఎవరు తక్కువ జీతం కి ఒప్పుకుంటే వారికే పట్టం! ఎక్కువ డిమాండ్ చేసేవారిని మధ్యలో పీకి పడేస్తారు. జాబ్ సెక్యూరిటీ లేదు. మంది ఎక్కువ ఐతే మజ్జిగ పలచన!" వింటున్న రోహిత్ ఆలోచన లో పడ్డాడు. తాత ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచిస్తాడు.కరోనాతో అమ్మా నాన్న పోవటంతో తాత దిక్కు ఐనాడు.తాతకి తనేగా వారసుడు!భార్య పోయాక కష్టపడి ఏకైక కుమారుడిని పెంచిపెద్ద జేసి ప్రభుత్వ అధ్యాపకునిగా తీర్చిదిద్దడం మాటలా?కానీ ఫ్రెండ్స్ మాటలు రోహిత్ ని ఆలోచనలో పడేశాయి"మీతాత ఎప్పుడు టపాకడ్తాడో తెలీదు. బడి పంతులుగా నిన్ను తన స్వార్ధం కోసం కట్టి పడేస్తున్నాడు."ఆరోజు తాత ని నిలదీశాడు రోహిత్ "తాతా! 4ఏళ్లలో బి.టెక్ ఖతం!డిగ్రీ ఆఫై బి.ఇడి గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ లేదు కదా?" తాత ఈకథ చెప్పాడు"చిన్నా!ఆజాడీనిండా రకరకాల ధాన్యపుగింజలు!ఓచిన్న ఎలుక అందులో దూరింది.కష్టపడకుండా హాయిగా కావల్సినప్పుడల్లా గుటుకు గుటుకు గింజలు తింటూ బాగా లావెక్కింది.క్రమంగా గింజలు జాడీలో తగ్గుముఖం పట్టాయి. ఎలుక అడుగుకి వెళ్లి పోయింది. పైకి ఎగరలేదు బాగా లావుగా మారటంతో! ఆ అడుగు పొడుగు జాడీలో అలా కృశించిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నది.పైనించి రోజూ ఎవరైనా గింజలు వేస్తే బతికేది. తాత్కాలిక సుఖాలు డబ్బు కోసం ఆశపడితే ఒళ్లు వంగదు.మన శక్తి యుక్తులను ఏరోజుకి ఆరోజు పదును పెట్టుకోవాల్సిందే!సరైన టైంకు పని మన బుర్ర పనిచేయకుంటే కాలం చేతిలోంచి కారే నీరు లా జారి పోతుంది. కులవృత్తులను
మర్చి యంత్రాలపై ఆధారపడి అందరూ ఒకటే చదువు ఫారిన్ కి ఎగిరిపోటంతో శ్రామికులు వలసకూలీలుగా ఇక్కడి అమ్మా నాన్న లు మిగిలారు.ఆగల్లీ చివర చెప్పులు కుట్టే అవ్వ తాత రోజుకి వంద సంపాదన తో తృప్తి గా ఉన్నారు. చెప్పు తెగితే వారి దగ్గరికి పరిగెత్తాల్సిందే! అదృష్టం ఉంటే ప్రొఫెసర్ అవుతావు.బడి అనేది శాశ్వతం!ఫ్యాక్టరీ కాదు కదా ఉత్పత్తి ఆగదు కదా? వేసవిలో కుండల గిరాకీ పెరిగింది. కరెంటు బాదుడు తో ఫ్రిజ్ వాడకం తగ్గింది. దూరపుకొండలు నునుపు నాయనా!" తాత చెప్పింది నిజమే!తృప్తి గా డిగ్రీ లో చేరాడు రోహిత్ 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి