"ధనమూలమిదం జగత్" అన్నది సూక్తి చేతిలో కాసు ఉంటే ఈ ప్రపంచాన్ని లెక్కచేయడు మనిషి సంపాదించి, సంపాదించి దురదృష్టం వెంటాడడంతో బక్క చిక్కి పోయి చేతిలో కాసు లేకుండా ఎందుకూ పనికిరాని వాడిగా పరిగణించబడతారు. ఎలాంటి పందేలకు వెళ్ళినా అపజయాలే తప్ప జయం కలగదు. ఎప్పుడు చేతినిండా డబ్బు ఉన్నదో అప్పుడు మదం పెరుగుతుంది. అహంతో విర్రవీగుతూ నాకు ఎదురే లేదని అనేక నీచమైన కార్యక్రమాలకు పూనుకుంటాడు. అలాంటి వాడిని ఎదిరించడానికి ఏ ఒక్కడు ముందుకురాడు ఎవరికి వారికి ప్రాణాపాయం. డబ్బుతో అతను ఏమైనా చేయగలడు అన్న భయం అతనిని సాహసానికి పురికొల్పడు ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రత్యక్షంగా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కూడా. అతనికి రౌడీ అనే పేరు పెట్టి గౌరవిస్తారు కూడా కొంతమంది. దీనికి చక్కటి పోలిక పెట్టాడు వేమన యోగి అడవికి రాజు సింహం ప్రతి జంతువు దానిని చూస్తే భయపడి తీరవలసిందే మనిషి సరే సరి. దాని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా భయపడతాడు. అలాంటి మృగరాజు ఆరోగ్యం క్షీణించి బక్క చిక్కి వేటాడడానికి కూడా శక్తి లేక మూల కూర్చున్నప్పుడు బక్కచిక్కిన కుక్క కూడా ఎంతో లోకువ కట్టి దగ్గరకు వెళ్లి కరవడానికి కూడా ప్రయత్నం చేస్తోంది. ఉపమా కాళిదాసస్య అని మన వాళ్ళందరు కీర్తిస్తారు. సిమిలి (పోలిక) లో జాన్ మిల్టన్ కు పేరు వారిద్దరినీ తక్కువ చేయడం కాదు కానీ వేమన చూపిన అనేక పోలికలను చదివితే వారిద్దరికి తీసిపోని శక్తిమంతుడు అని గ్రహించవచ్చు.
బలాబలాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి