సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అనుకోవాలి...వినుకోవాలి...
******
ఏదైనా మనం అనుకోవడం, వినుకోవడంలోనే  గెలుపు, ఓటమి, జరిగే మంచి, చెడు అన్నీ చాలా వరకు ఆధారపడి ఉంటాయి.
మనసు ఎప్పుడూ ఓ విద్యార్థే. ఒకటి చేయాలనుకుంటే మరొకటి చేయడానికి సిద్ధపడుతుంది.అంతరాత్మ చెప్పింది వెంటనే ఆచరించడానికి ఒప్పుకోదు.
విద్యార్థులకు ఓపిగ్గా శిక్షణ ఇచ్చినట్టుగానే మనసుకూ ఇవ్వాలి. అప్పుడే అంతరాత్మ అనుకున్న మంచేదో  ఆచరణలో కనబడుతుంది.
 మహనీయుల చరిత్రలు, సాధించిన విజయాలను చదివేలా ప్రోత్సహించడమే కాకుండా, చుట్టూ ఉన్న సమాజంలో విజయపథంలో దూసుకు పోతున్న వారి అనుభవాలను,వారి ఆశయాలు,ఆదర్శాలతోకూడిన ఆలోచనలను వినేలా చేయాలి.
అలా మన మనసును సంసిద్ధం చేసుకున్నప్పుడే  అనుకున్నవి,వినుకున్నవి చేయగలం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏కామెంట్‌లు