ఐకమత్యం (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆటలు ఆడాలందరూ
పాటలు పాడాలందరూ
ఎక్కువ తక్కువ లేనేలేదు
కులము మతము లేనేలేదు
ధనికా బీదా తేడాలేదు
రంగులు పొంగులు లేనేలేవు
మానవత్వం మరవొద్దూ
కోపం తాపం ఆదివద్దూ 
మనలో మనకూ భేదాలున్నా 
ఐకమత్యమే మన బలమన్నా
మనుషుల విలువలు పెంచాలీ 
అందరి మంచీ కోరాలీ 
భారతీయులం అందరం 
ఇంద్రధనువూ రంగులం !!

కామెంట్‌లు