మా ఊరి ఆ పిలగాడు
ఉన్న ఊల్లె ఉండక
పట్నం ఎందుకు పోయిండో
సెప్పాలంటే
పెద్ద కతే ఐతదుల్లా!
అయితే మీకు
మూడు నాలుగు ముచ్చట్లతోనే మనుసున వట్టేటట్టు సెపుతా!
ఎవ్వలైన గని
ఊరిడిసి ఎందుకు వోతరు?
నౌకరి సెయ్యడానికో,
ఆపని,ఈపని జేసీ
నాలుగు పైసలు సంపాయించడానికే
పోతరు గద.
మరి ఈ పిలగాడు మాత్రం
గందు కోసం పట్నం పోలేదట.
మరి ఎందుకు వోయినట్టు??
ఎందుకు వోయిండంటే......
దానికి కారణం ఒక పత్రిక.
ఆ పత్రిక పేరు ' స్రవంతి '.
అగో గా పత్రిక సెయ్యవట్టే
మా ఊరి పిలగాడు
పట్నం పోయిండు.
అసలు ముచ్చట ఏందంటే..
ఆ పిలగాడు తెల్ల కాయిదాల మీద,కాపీలల్ల ఏవేవో రాసుకునేటోడు.
రాసినవి కొన్నింటిని
ఊరి నుంచి కొన్ని
పత్రికలకు పంపిత్తే
ఒక్క పత్రిక గుడ ఆ పోరడు
రాసినవి అచ్చు గొట్టలేదట.
ఒగ సారి ఏదో పని మీద
పట్నం అచ్చినప్పుడు
స్రవంతి పత్రిక ఆపీసుకు
పోయి అప్పటికప్పుడు
పది పదాలున్న ఒక కైత రాసి ఇచ్చచ్చిండట.
ఇచిత్రంగా మూడు దినాలకే
ఆ కైత అచ్చు అయిందట.
దాన్ని జూసినంక పోరనికి
బగ్గ సంబురమయ్యిందట.
గప్పుడే
' గీపట్నం ఉంటే
రాసినయి పత్రికలల్ల అత్తయ్
అన్నమాట. గంతే కాకుండ
పెద్ద పెద్ద కవులను, రచయితలను సూడచ్చని
మనుసుల అనుకున్నడట.
గంతే.. మూట ముల్లె సదురుకొని పట్నం పోయిండు
ఒక్క మాటలో సెప్పాలంటే..
కవిని కావాల్నని పట్నం పోయిండుల్లా!
మరి పట్నం బోయినంక
గా పోరడు పట్నంల ఆగమయిండా? ఏమైండో
మల్లోసారి సెపుతా!
ఎవడి పిచ్చి ఆడికి ఆనందం
ఔ మల్ల!
ఉన్న ఊల్లె ఉండక
పట్నం ఎందుకు పోయిండో
సెప్పాలంటే
పెద్ద కతే ఐతదుల్లా!
అయితే మీకు
మూడు నాలుగు ముచ్చట్లతోనే మనుసున వట్టేటట్టు సెపుతా!
ఎవ్వలైన గని
ఊరిడిసి ఎందుకు వోతరు?
నౌకరి సెయ్యడానికో,
ఆపని,ఈపని జేసీ
నాలుగు పైసలు సంపాయించడానికే
పోతరు గద.
మరి ఈ పిలగాడు మాత్రం
గందు కోసం పట్నం పోలేదట.
మరి ఎందుకు వోయినట్టు??
ఎందుకు వోయిండంటే......
దానికి కారణం ఒక పత్రిక.
ఆ పత్రిక పేరు ' స్రవంతి '.
అగో గా పత్రిక సెయ్యవట్టే
మా ఊరి పిలగాడు
పట్నం పోయిండు.
అసలు ముచ్చట ఏందంటే..
ఆ పిలగాడు తెల్ల కాయిదాల మీద,కాపీలల్ల ఏవేవో రాసుకునేటోడు.
రాసినవి కొన్నింటిని
ఊరి నుంచి కొన్ని
పత్రికలకు పంపిత్తే
ఒక్క పత్రిక గుడ ఆ పోరడు
రాసినవి అచ్చు గొట్టలేదట.
ఒగ సారి ఏదో పని మీద
పట్నం అచ్చినప్పుడు
స్రవంతి పత్రిక ఆపీసుకు
పోయి అప్పటికప్పుడు
పది పదాలున్న ఒక కైత రాసి ఇచ్చచ్చిండట.
ఇచిత్రంగా మూడు దినాలకే
ఆ కైత అచ్చు అయిందట.
దాన్ని జూసినంక పోరనికి
బగ్గ సంబురమయ్యిందట.
గప్పుడే
' గీపట్నం ఉంటే
రాసినయి పత్రికలల్ల అత్తయ్
అన్నమాట. గంతే కాకుండ
పెద్ద పెద్ద కవులను, రచయితలను సూడచ్చని
మనుసుల అనుకున్నడట.
గంతే.. మూట ముల్లె సదురుకొని పట్నం పోయిండు
ఒక్క మాటలో సెప్పాలంటే..
కవిని కావాల్నని పట్నం పోయిండుల్లా!
మరి పట్నం బోయినంక
గా పోరడు పట్నంల ఆగమయిండా? ఏమైండో
మల్లోసారి సెపుతా!
ఎవడి పిచ్చి ఆడికి ఆనందం
ఔ మల్ల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి