సునామీ (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

మా పాప పలుకులు తేనెవాకలు
మా పాప కన్నులు కలువరేకులు
మా పాప అడుగులు హంసల అడుగులు
మా పాప నాట్యం చేస్తే
ఒక కురంగం సంతోషంతో ఎగిరినట్టు
మా పాప పాట పాడితే
ఒక సారంగం పంచమ స్వరంలో పాడినట్టు
మా పాప మాటాడితే
ఒక శింజినీ టంకారమైనట్టు
మా పాప నవ్వితే
ముక్కంటి తలపువ్వు మెరిసినట్టు
మా పాప దుఃఖిస్తే
మా ఇంట్లో సునామీ వచ్చినట్టు !!

కామెంట్‌లు