జీవితం అణువణువు రాగరంజితం
జీవితం మధుర రాగాలమయం
మలచుకుంటె మది సుమధురం
శృతి తప్పినా అదోగతి పయనం.....
పలుకులన్ని మెుదలు అమ్మ పాట తో
నిదురమ్మకు ఆరంభం జోలపాట తో
ప్రభాత వెలుగులకు స్వాగతం సుప్రభాతంతో
ఒంటరితనంకు సెలవు సంగీతంతో.......
మనసులు కలయికకు భావాల పందిరి సంగీతం
అనురాగాల సవ్వడి సంగీతం
ఆనందంలో సంగీతం
ఆటల్లో సంగీతం బాధలో సంగీతం....
నాట్యంలో సంగీతం
నవరసాల్లో సంగీతం
అనుభుాతిలో సంగీతం
ఆవేశ గీతంలో సంగీతం..
అందాల పెన్నిది
మమతల సన్నిది
బాధనైనా తోలగించు
రోగాలను మరిపించు
దైవారాధనకై వెలుగు...
అనుబంధమై నిలుచు
సంగీతంలేని బ్రతుకు శుాన్యం
పాడని నోరులేదు
ముాగవారిని కుాడా పలికించు
మానస సరోవరమేకాదా సంగీతం
జీవితాన పరిమళాలు వెదజల్లుతుా!...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి