++సూర్య గోళం++;- సుమ
 " సూర్య కాంతం,నువ్వు సార్థక నామధేయురాలివి" అన్నాడు  రమణా రెడ్డి గుండ్రంగా ఉన్న భార్యతో.
"అంటే ఏంటి సరిగ్గా చెప్పి ఏడవొచ్చుగా?" హుంకరించింది సూర్య కాంతం.
"అబ్బే! సూర్యుడిలా ఉన్నావని"...
" నాకు ఇందులో ఏదో పెడర్థం కనిపిస్తుంది"…
"లేదు..లేదు నిజం చెప్తున్నా సూర్యుడిలా మండిపోతావు కదా!" ఎరక్కపోయి అన్నాను అనుకుంటూ.
"అంటే నేను గయ్యాళి ననే కదా…మీకు ఈ రోజు భోజనం కట్ " రుస రుస లాడింది సూర్య కాంతం.
'ఎరక్కపోయి అన్నాను ఇరుక్కుపోయాను' అనుకుంటూ తలపట్టుకున్నాడు రమణా రెడ్డి.

కామెంట్‌లు