గొర్రె దాటు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 గొర్రెలు, మేకలు అన్న రెండు పేర్లు మనమొకటేనని విన్నాము. ఈ రెంటికీ భేదం తెలియాలి ముందు. మేక చాలా చాలా తెలివైన జంతువు నడి బజారులో మేక ఉంటే వాహన చోదకులకు కష్టం దాని మేధా శక్తి అమోఘం. ఎటునుంచి ఎటు వెళుతుందో  ఎదుటి వాడికి తెలియదు కానీ గొర్రె అలా కాదు గొర్రెదాటు అని ఒక మాట ఉంది గొర్రెలు గుంపుగా వెళుతున్నప్పుడు  ఒక చిన్న కర్ర అడ్డుపెడితే దానిని దాటి వెళతాయి దాని వెనుక వచ్చేది కూడా అలాగే దాటుతుంది  4-5 గొర్రెలు దాటిన తర్వాత కర్రముక్క తీసివేసినా మిగిలిన గొర్రెలన్ని అలాగే దాటుకుంటూ వస్తాయి దీనినే గొర్రెదాటు అంటారు. అంటే బుర్ర పని చేయదు అని. అలాంటి గొర్రెలమంద ఒకచోట ఉన్నప్పుడు వాటి పిల్లలు  పాలు తాగడం కోసం తల్లిని గుర్తుపట్టి వస్తాయి. ఎంత గుంపులో ఉన్నా తల్లి గొర్రెను గుర్తు పడతాయి. అలాగే ఈ ప్రపంచంలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు తెలుసుకోవడం చాలా కష్టం ప్రత్యేకించి కపట యోగులు చేరినప్పటి నుంచి అసలు యోగులు ఎవరో తెలియడం లేదు. తపస్సు చేసే వారికి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ లక్ష్యాన్ని చేరుకున్న వారు దాని మీదే దృష్టిపెట్టి మమేకమై  అంకితభావంతో ఉంటారు. అలాంటివారిని  భక్తులు  గుర్తుపడతారు. ఎవరు నిజమైన స్వామో, ఎవరు దొంగ వేషాలు వేస్తున్నారో తెలిసిపోతుంది. గొర్రె పిల్లను భక్తునితో పోల్చి విషయం  చెప్పినారు వేమన. చక్కటి పోలిక అందరికీ అర్థమయ్యే రీతిలో ఆటవెలదిలో మనకందించాడు వేమన.


కామెంట్‌లు