ప్రపంచమే ఒక వ్యాయామ శాల. -మణి నాథ్ కోపల్లె
 ప్రపంచమే ఒక వ్యాయామ శాల. ఇక్కడ మనం  రావడం అందులోకి ప్రవేశించమంటే మనల్ని మనం బలవంతులుగా  చేసుకోడానికే!                                        -స్వామి వివేకానంద.                                                                                                                    నిన్న21-6-22  జరిగిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా  హైదరాబాద్ ప్రొఫెషనల్స్ మరియు  అవధాన సరస్వతీ పీఠం ఆధ్వర్యంలో జరిగిన యోగా శిబిరంలో  సూర్యోదయ వేళ యోగాసనాలు , ధ్యానం, ప్రాణాయామ, డీప్ రిలాక్సేషన్  మొదలైన అంశాలలో ఎందరో పాల్గొని విజయవంతం చేశారు. దీనిని నిర్వహించిన వారు.  యోగా గురు శ్రీమతి మాలతి గారు, *(ఎం.సి.ఎ. ఎంయస్ సి యోగా ) శ్రీ అరవింద్ (ఐ. టి. ప్రొఫెషనల్).  .           నేడు ఆధునిక ప్రపంచ జీవన శైలి లో అంతా ఊరుకులూ పరుగులే! అన్నీ సాధించాలి. అన్నీ కావాలి. డబ్బు, బంగ్లా, హోదా ! అన్నిటిమీదా ఉత్సాహం, శ్రద్ధ చూపిస్తున్నారు.కానీ అసలైన ఆరోగ్యం మీద మాత్రం లేదు. యోగా సాధన ద్వారా మనసుని అదుపులో (కంట్రోల్) లో ఉంచుకోవటం, ధ్యానం ద్వారా  సాధ్యపడుతుంది. శరీరం బరువు తగ్గటం, చాలా రోజాలు నయమవుతాయి. ఎన్నిటినో యోగా సాధన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యచ్చు.  ఆహార నియమాలు,  వ్యాయామం, యోగాసనాలు వంటి ద్వారా సాధించవచ్చు. యోగాలో ఎన్నో అంశాలు వుంటాయి. హఠ యోగం, విన్యాస యోగం, అష్టాంగ యోగం,  మొదలయినవి..                                               

ఏడాదికి ఒక రోజు మాత్రమే  జరుపుకునే యోగా దినోత్సవాలు కాదు కావలసింది. . ప్రతిరోజూ తీసుకునే ఆహారంతో పాటు నియమంగా యోగా, వ్యాయామాలు  కూడా  ఉదయమే చేయాలి. అది అలవాటు చేసుకోవాలి.  యోగా చేసిన రోజు మనసంతా ప్రశాంతంగా, ఏవిధమైన టెన్షన్స్ వుండవు అని అనిపిస్తుంది. టెన్షన్ రిలాక్సేషన్ కూడా ముఖ్యం. మనసు ప్రశాంతంగా వుంటే ఎన్నో సమస్యలకీ  పరిష్కారం లభిస్తుంది.  ప్రపంచం అంతా యోగాని, దాని ప్రాముఖ్యతని గుర్తించి ఏడాదిలో ఒక రోజుని 'యోగా డే' అన్నారు. అదే జూన్ 21. ఆ రోజుని అందరూ యోగాడే గా అన్ని దేశాల్లోనూ. అన్ని  చోట్లా జరుపుకుంటున్నారు. 
                                                                     
కామెంట్‌లు
తెలుగోల చెప్పారు…
శుభం
తెలుగోల చెప్పారు…
శుభం