నెమలి పింఛo;(బాలగేయం)-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
 నెమలి నెమలి రావమ్మా 
నాట్యం నేర్పి పోవమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 చెలిమి చేసి పోవమ్మా
 నెమలి నెమలి రావమ్మా 
కలిమి బలిమి ఇవ్వమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 నేర్పుగ ఉండుట  నేర్పమ్మా
 నెమలి నెమలి రావమ్మా
  నయగారాలు  నేర్పండి
 నెమలి నెమలి రావమ్మా
 ఓర్పుగ ఉండుట నేర్పమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 నా నెచ్చెలి ఎక్కడ చెప్పమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 నవ్వులు నాకు నేర్పమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 నీ పింఛo కొంచెం ఇవ్వమ్మా
 నెమలి నెమలి రావమ్మా
 నీ అందాలన్నీ ఇవ్వమ్మా!

గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
తేది:29-05-2022
సెల్: 9493235992.

కామెంట్‌లు