*భర్తృహరి సుభాషితములు - పద్యం (౧౦౦- 100)*
 *కర్మ పద్ధతి*
తేటగీతి:
*భువనమునఁబూర్వసంభృత పుణ్యరాశి*
*యగుచు నుదయంబు గాంచిన సుగుణనిధికి*
*వనము పురమగుఁ, బరు లాత్మజనము లగుదు*
*రవని నిధిరత్నపరిపూర్ణయయి ఫలించు.*
*తా:*
ఈ భూమి మీద ఎవరికైతే తాము ఇదివరకు చేసిన మంచి పనుల ఫలితము వెంట వుంటుందో, వారికి, కారడవి మహా పట్టణం లాగా, శత్రువులు ఆత్మ బిందువుల లాగా, ఈ భూమి అంతా రత్నములతో నిండిన గనులు లాగా కనిపిస్తుంది....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*పాండవులు, అడవులలో వున్నా కానీ ఆనందాన్ని పొందారు. ఏకచక్రపురంలో బిచ్చమెత్తుకున్నారు కానీ నలుగురికీ ఉపయోగ పడ్డారు. విరటుని రాజ్యం లో అజ్ఞాతవాసం చేసినా ఎవరికీ తెలియలేదు. వీటన్నిటికీ కృష్ణ భగవానుడు వారికి తోడుగా వున్నడు కనుక సాధ్యమైంది అనుకోవచ్చు. మరి ఆ భగవానుడు దుర్యోధనాధులకు ఎందుకు తోడుగా లేరు. దానికి కారణం, వారి వద్ద పూర్వ పుణ్యం ఫలరూపంగా లేకపోవడం. పాండవులకు ఆ పూర్వ పుణ్య ఫలము మాత్రమే కాకుండా వారి ధర్మమార్గ నడవడిక కూడా తోడైంది. అందుకే భగవానుడు వైరి పక్షాన కాకుండా వారి పక్షమన నిలిచాడు. అందువల్ల మనం వీలైనంత వరకు ధర్మ మార్గం లో పదిమంది గురించి ఆలోచిస్తూ వారికి మంచి చేసే పనులు చేయగలిగితే పరమేశ్వర కృప ఎల్లప్పుడూ వుంటుంది. ఆ పార్వతీ పతి కటాక్షం మన అందరి మీద సర్వవేళ సర్వావస్థలందు వుండాలని  ..... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు