గురువే మూలం;-ప్రవళిక--10వ, తరగతి,--జి.ప.ఉ.పా. అమడబాకుల,-వనపర్తి జిల్లా.
గురువు 
జ్ఞానానందించి 
అజ్ఞానంతా తొలగించు

గురువు
బతుకు త్రోవ చూపించి
భవితను నిర్మించు

గురువు
మంచినిమాత్రం పెంచి
చెడుత్రోవను తప్పించు

గురువు
భయాన్నంత పారద్రోలి
గుండెల్లో ధైర్యం నింపు

గురువు
జీవితంలో మరవలేని
చిరంజీవై నిలుచు

గురువుకెపుడు చేయాలి
నమస్కారం
గురువుపట్ల ఉండాలి
తరిగిపోని సంస్కారంకామెంట్‌లు