*శ్రీ శివపురాణ మాహాత్మ్యము*--*రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(౧౧౬ - 116)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*కామదేవుని పేర్లు - రతీదేవి తో వివాహము - సంధ్య చరిత్ర - చంద్రభాగ పర్వతము మీద సంధ్య తపస్సు*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా! నా మానసపుత్రులు అయిన మరీచి ముదలగు వారు, నా హృదయము నుండి పుట్టిన పురుషునికి పేర్లు పెట్టారు. దక్ష ప్రజాపతి మొదలగు వారు అతనికి ఇల్లు ఏర్పరచి వివాహం చేసారు. బ్రహ్మ హృదయము నుండి పుట్టాడు కనుక "మనోభవుడు" అని, పుట్టుకతోనే అందరి మనసులనూ మధించినాడు కనుక "మన్మథుడు" అని, అతనితో సమానమైన సుందర రూపం ఎవ్వరికీ లేదు, వుండదు, కామరూపుడు కూడా కనుక, "కాముడు" అని, ప్రజలను అందరినీ మదమత్తులు గా చేయగలడు కనుక "మదనుడు" అని, దర్పముతో పుట్టాడు కనుక "దర్పుడు" అని, దర్పమునే కలిగి వున్నాడు కనుక "కందర్పుడు" అని పేర్లు ఇచ్చారు.*
*దక్షుడు తన శరీరము నుండి వచ్చిన చెమట నుండి పుట్టిన స్త్రీ కి "రతి" అని పేరు పెట్టారు. ఈమె అతిలోక సుందరి. సర్వ సద్గుణములు ఆమె సొంతం. మన్మధుని చూచి దక్షుడు ఈ రతీదేవి ని, నీవు వివాహం చేసుకో. నీకు ఈమె అన్నివిధాలా సాటి అయినది. ఈమె నీయందు అనురాగంతో ఎప్పుడూ నీతోనే కలసి వుంటుంది. ఈ వివాహం వలన మీరు ఇద్దరూ సుఖ సంతోషాలతో వుంటారు అని చెప్పి రతీదేవి, మన్మధులకు వివాహం జరిపిస్తాడు, దక్షుడు. వీరిద్దరి వివాహ బంధం, ఒక యోగి యోగవిద్యను పొందినట్లు, లక్ష్మీ దేవి నారాయణుని కలసి ఆనందమును పొందినట్టు గా సాగిపోతోంది.*
*రతీమన్మధుల వివాహం తరువాత మరీచి మొదలగు మానస పుత్రులు, దక్షుడు, మిగిలిన ప్రజాతులు వారి వారి గృహాలకు వెళ్లి సుఖ సంతోషాలతో వున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు