"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 67,వ, బాగం)-"నాగమణి రావులపాటి "
 వేణు అన్న మాటలకు అందరూ నవ్వకుండా 
వుండలేక పోయారు...ఇంతలో గీత అమ్మగారే
స్వయంగా పూర్ణిమను తీసుకు వచ్చారు ...
తలవని తలంపుగా వచ్చిన పూర్ణిమను చూసి
వావ్ పూర్ణిమా భలే అందంగా తయారయ్యావే
చాలా బాగున్నావు అంటూ తెగ పొగిడేసాడు..!!
చాల్లేరా నీ మాటలు దాన్ని బెదరగొట్టేటట్టు వున్నావు 
చూడు ఎంత ఇబ్బంది పడుతోందో అని గీత 
ప్రేమగా మందలించింది తమ్మడిని అయ్యో రామా 
నేనేమన్నాను అందంగా వుంది కదా అని 
పొగిడానంతే అని నవ్వుతూ అన్నాడు వేణు...!!
నీలిమ అందరికీ స్వీట్స్ అందించింది హలో
మీ పరిచయం చెప్పారు కాదు అని నీలిమ ను
అడిగాడు వేణు... తాను పరుశురామ్ గారి డాటర్ 
అమెరికాలో చదువుకుంది జాబ్ కూడా వచ్చింది
త్వరలో అమెరికావెళుతుంది అని అన్నది గీత‌..!!
వావ్ సూపర్ అండి శుభాకాంక్షలు మీకు విదేశీ
యానం సవ్యంగా సాగాలని కోరుకుంటున్నా అని
అన్నాడు వేణు థాంక్యూ అండి మీ అభిమానానికి
ధన్యవాదాలండీ పూర్ణిమ అదృష్టవంతురాలే
ఎప్పుడూ సలదాగాై వుండే మీరు దొరకటం అని 
అన్నది నీలిమ.......!!
అరే నేనే మాట్టాడేస్థున్నా పూర్ణిమ ఒక్క మాట
కూడా మాట్లాడట్లేదు కొంపధీసి నేను నచ్ఛలేధా
ఏమిటీ అలా అనకే బాబు నేను నీమీద ఎన్ని
ఆశలు పెట్టుకున్నా అని నవ్వుతూ అన్నాడు
పూర్ణిమతో(సశేషం).. .‌.............!!

కామెంట్‌లు