"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 68వ,బాగం) "నాగమణి రావులపాటి "
 ఇంతలో గీత అమ్మగారు కల్పించుకుని పూర్ణిమకు నీవు నచ్చటం కాదురా నీవు పూర్ణిమ నచ్చలేదన్నా
నేను ఊరుకోను పూర్ణ నా కోడలు దాన్ని ఏమైనా
ఏడిపించావంటే నేను ఊరుకోను అని నవ్వుతూ 
అన్నారు గీత అమ్మగారు...‌......!!
ఫార్మాలిటీ ముగిసింది పూర్ణిమను ముచ్చట్లలో
దించాడు వేణు చిన్నప్పటి విషయాలు జ్జాపకం 
చేసుకుంటూ ఒకరికి ఒకరు కబుర్లలో పడ్డారు....
నీలిమ వైభవ్ తో బిజినెస్ ముచ్చట్లు ముచ్చటిస్తూ 
ఒకరిపై ఒకరు కళ్ళతో ప్రేమను కురిపించుకోవటం
రాహుల్ గమనించాడు............!!
నెమ్మదిగా కుసుమ దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుస
లాడాడు కుసుమా గమనించావా మనోడు కూడా
ప్రేమలో పడ్డాడు నేను వచ్చిన దగ్గరి నుండి
గమనిస్తున్నాను వాళ్ళ ఇద్దరినీ... మనకు లైన్
క్లియర్ సుగమం అయ్యేట్టు వుంది అని అనగానే
ఔను రాహుల్ నేనూ గమనిస్తూనే వున్నా........!!
నీలిమ చలాకీ తనం వైభవ్ లో ఉత్తేజం నిండినట్టున్నది... ఎప్పుడూ సైలెంట్ గా వుండే వాడు
నీలిమ తో గలగలా మాట్లాడటం నాకు 
వింతగా నే వున్నది... చూద్దాం ఏం జరుగుతుందో
అని ఆరాధనగా చూసింది రాహుల్ వైపు కుసుమ...!!
ఇంతలో గీత అక్కకి రావటం చూసి రాహుల్
గీత భర్త రాజీవ్  దగ్గరికి వెళ్ళాడు.....బాగుంది 
కుసుమా ముచ్చటైన మూడు జంటలు
ముచ్చట్లలో మునిగిపోతే చూసే నాకు రెండు కళ్ళు చాలట్లేదు అని అన్నది గీత.........!!
నీ మొహం ఊరుకోవే ఆంటీ విన్నారంటే బాగోదు
అని అన్నది కుసుమ...ఇంతలో కుసుమ బాబాయి
అక్కడికి వచ్చీ ఏమ్మా కుసుమా తాంబూలాలు
మహోత్సవం ముగిసింది నాకు చాలా ఆనందంగా
వున్నది అన్నా వదినా లేని లోటు తెలియకుండా
చక్కగా కార్యక్రమం సుకాంతం అయింది.....!!
మన పూర్ణ అదృష్టవంతురాలు కన్నతల్లి
తండ్రుల్లా చూసుకునే అత్తా మామలు కాలు
కింద పెట్టకుండా చూసుకునే వేణు సొంత అక్కలా
ఆదరించే ఆడబడుచు ఇంతకంటే
ఏ ఆడపిల్ల కైనా ఏంకావాలి అని కళ్ళలో
ఆనంద భాష్పాలు సుడులు తిరగగా కుసుమ తో
అన్నాడు బాబాయి.............!!
అవును బాబాయ్ దాని గురించి నాకు బెంగ తీరింది
దాని పెళ్ళి సందడీ మీ చేతులమీద జరిపించారంటే
ఎక్కడ వున్నా అమ్మా నాన్నల ఆత్మలు శాంతిస్తాయి
అని గద్గద స్వరంతో అన్నది కుసుమ ఇదంతా
గమనించే గీత అమ్మా నాన్నలు ఏమండీ అన్నయ్య
గారు కుసుమ మీకు ఎంతో మాకూ అంతే మీరు
నిశ్చింతగా వుండండి అని అని అనగానే
అవును బావగారు ఇంకా మనం ఉభయులూ
పెళ్ళి కార్యక్రమాల్లో మునిగి తేలాలి అని గీత
నాన్నగారు అనగానే అలాగే బావగారు అని
అందరూ కులాసాగా నువ్వే నవ్వులు పూవులై కురిసాయి ఆ ఇంటిలో(సశేషం) ...............!!

కామెంట్‌లు