"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 69వ,బాగం)నాగమణి రావులపాటి "
 సందడి సందడిగా సరదాగా బోజనాలు కార్యక్రమం
ముగుసింది బోజనాలు ముగించగానే ఎవరికి వారు 
వెళ్ళిపోగా గీత ఫేమిలీ నీలిమ పరశురామ్ గారు 
బాబాయి పిన్ని మిగిలారు గీత నాన్నగారు అమ్మా
కుసుమా మేము బయలు దేరుతాము తల్లి
వీలు చూసుకుని వస్తాము.........!!
  పెళ్ళికి ఏమేమి కావాలి వగైరా విషయాలు తీరికగా మాట్లాడు కుందాము నీవేమీ కంగారు పడకు అన్నీ మేము చూసుకుంటాము ధైర్యంగా వుండు అని అన్నారు సరే అంకుల్ మీరెలా చెపితే అలాగే చేద్దాము నాకు తెలియక ఏదన్నా పొరపాట్లు జరిగితే
మన్నించండి అని అన్నది కుసుమ.........!!
ఎంత మాట తల్లి అలాంటి భయాలు ఏమీ 
పెట్టుకోకు మాకు గీత ఎంతో నువ్వూ అంతే
సరేనా అని అనునయించారు గీత అమ్మగారు 
ఇదంతా గమనిస్తున్న వేణు మీ వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో పెళ్ళి ముహుర్తం  పెట్టేలా
లేరు ...............!!
పూర్ణిమా మనం హేపీగా రిజిస్టర్ మేరేజ్ 
చేసుకుందాం ఎలాగూ అందరూ ఇక్కడే
 వున్నారుగా ఎందుకు ఆలస్యం ఈ ముహుర్తాలు
బాజా బజంత్రీలు మనకు అవసరమా చెప్పు
అని హాస్యంగా అన్నాడు............!!
అమ్మో నిన్ను నమ్మకూడదురా  దాన్ని తీసుకెళ్ళి
చేసుకున్నా చేసుకునే రకం నీవు... ఆంటీ అతి
దగ్గరలో మంచి ముహుర్తం వుంటే చూడండి
వీళ్ళకు పెళ్ళి చేసేస్తే ఒక పని అయిపోతుంది
అని అన్నది కుసుమ.........!!
అందరూ  వేణు మాటలకు తెగ నవ్వేసారు
ఔను కుసుమ గారు వేణు చెప్పినట్టు చేయండి 
పనిలో పని మేరేజ్ కూడా చూసుకుని వెళ్తాము 
మళ్ళీ మళ్ళీ వచ్చే పని లేకుండా వుంటుంది
అని నవ్వుతూ అన్నది నీలిమ..........!!
చాల్లేరా నీ బడాయి మాటలు...త్వరలోనే చేస్తాము
మీ పెళ్ళి కాస్త ఓపిక పట్టు అని అన్నది కుసుమ
నవ్వుతూ... అందరూ కారులో కూర్చోగానే డ్రైవింగ్
సీట్లో కూర్చుంటూ పూర్ణిమను పిలిచాడు వేణు
అక్క వైపు చూసింది పూర్ణిమ..........!!
వెళ్ళు అన్నట్టు సైగ చేసింది కుసుమ... బెరుకు
బెరుకుగా కారు దగ్గరికి వెళ్ళింది పూర్ణిమ...
ఇదుగో పూర్ణా నామీద బెంగతో అన్నం తినటం
మానకు త్వరలో మనకు పెళ్ళి చేస్తారుగా
అప్పటిదాకా నీవు జాగ్రత్త............!!
నేను వస్తుంటాలే ఓకేనా అని పూర్ణిమ చేతిని తన 
చేతిలోకి తీసుకుని మణికట్టుపై ముద్దాడాడు
ఆ హటాత్పరిణామానికి  పూర్ణిమ ఒక్క ఉదుటున
లోనికి పరుగెత్తింది  ఏంటి వేణు దాన్ని అలా
బెదరగొట్టేశావు అని తమ్ముడిని మెత్తగా చివాట్లు
పెట్టింది గీత.. వేణు లోపలికి వెళ్ళాడు(సశేషం).....!!

కామెంట్‌లు