"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 72వ,బాగం) "నాగమణి రావులపాటి "
 పరశురామ్ గారి మాటలకు, అలాగే సార్ పిల్లలను
ఒక మాట అడిగి, ఒక మాట మీదకు వద్దాము,  అని
సాలోచనగా ఎటో చూస్తున్న కుసుమ ను ఉద్దేసించి.
ఏమ్మా ఏమిటీ ఆలోచనలో పడ్డావు. అని అడిగిన
పరశురామ్ గారి మాటలకు తలతిప్పి చూసింది.
కుసుమ...‌.....!!
చెప్పు తల్లి ఎందుకు సంకోచం ,ఏదో చెప్పాలని
ఆరాటం పడుతూ వున్నావు.. మీ నాన్న లాంటి
వాడిని ఏదైనా సరే వింటాను.. నాకు చేతనైన
సహాయం, సలహా ఇస్తాను ...అని భరోసాగా
అనేసరికి, ఒక్కసారిగా దుక్కం పొంగి పొర్లింది
కుసుమ అంతరంగంలో......!!
సార్ మీకు ఎలా చెప్పాలో ,చెప్పవచ్చో ,చెప్పకూడదో
కూడా తెలియట్లేదు....కానీ,చెప్పటం, నా బాధ్యత
రాహుల్ గురించి ,అని,ఆగింది... రాహుల్ గురించా
ఏమిటి ,అతను చాలా మంచివాడులా ,వున్నాడు.
అని అన్నారు,పరశురామ్ గారు..............!!
అవును రాహుల్ చాలా మంచివాడు ...అమ్మా
నాన్నా బ్రతికి వుంటే, మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్ళి
అయిపోయి వుండేది,..అని కుసుమ అనగానే
ఆశ్చర్యంగా!! చూడటం ఆయన వంతు అయింది...!!
ఏమిటి కుసుమా రాహుల్ నీవు ప్రేమికులా అతను 
మీ అమ్మా వాళ్ళు ఉన్నప్పటినుండి??అని చెప్పుతల్లీ 
నీవే అని అడిగారు...పరశురామ్ గారు...అవును 
సార్ రాహుల్ కు నేనంటే ఎంతో ప్రేమ. నాకు కూడా
అంతే  .కానీ మా ఇద్దరి కేస్ట్ లు వేరు కావటాన... అమ్మానాన్నలు ఒప్పుకోరని వాళ్ళకు తెలియకుండా
పెళ్ళి చేసుకుందాం అని అనుకున్నాము.......!!
మరో 15,రోజులలో పెళ్ళి చేసుకుందాం అని
అనుకున్న,తరుణంలో విధి వక్రించి అమ్మానాన్న
దేవుని సన్నిధిన చేరారు...నా చెల్లీ తమ్ముడు
అనాధలు కాకూడదని నాప్రేమను త్యాగం చేసి
రాహుల్ కు తెలియ,నీయకుండా ,ఇక్కడకి వచ్చి
 మనుగడ సాగించాము..తరువాత కధ మీకు తెలిసిందే.....!!
కానీ రాహుల్ వాళ్ళ ఇంటిలో అందరికీ నేనంటే 
ఇష్టమే...నేను నా ఉనికి తెలియ,నీయకుండా, చేసేసరికి.....
దాదాపు రాహుల్ నాకోసం చాలా సఫర్ ,అయ్యాడు
ఇంట్లోవాళ్ళు ,ఎంత ,చెప్పినా ,నన్ను,తప్ప,
ఎవరినీ ,చేసుకోనని మొండిపట్టు పట్టాడు..‌.
తలవని తలింపుగా ఇక్కడి,బ్యాంకుకే బదిలీ అయి
రావటం అదే బ్యాంకు లో,నేను లోన్,తీసుకోవటం
నాకు,తారసపడటం,గీత ద్వారా అంతా.....
తెలుసుకున్న,నేను, రాహుల్ ను వేరే పెళ్ళి
చేసుకోమని చెప్పినా చేసుకుంటే నిన్నే  చేసుకుంటా
లేకుంటే ఇలానే  వుంటానని అన్నాడు...........!!
నేను కూడా రాహుల్ లేని జీవితం ...ఇంకెవరితోనూ
ఊహించలేను...ఇలాగే చెల్లి తమ్ముడు వాళ్ళ
తోడిదే నా జీవితం ...పెళ్ళి ఆలోచన లేనే లేదు...
అని అనుకున్నా, రాహుల్ రాకతో నాలో ప్రేమ
మళ్ళీ చిగురించింది........!!
రాహుల్,నేను కలిసి,ఒక,నిర్ణయానికి వచ్చాము...
పూర్ణిమకు వైభవ్ కు పెళ్ళిళ్ళు చేసేవరకు మనం
పెళ్ళి ప్రస్తావన తేవద్దని అంతదాకా అపరిచితులు
గానే వుండాలని అనుకున్నాము........!!
 
అలానే వుంటున్నాము గీత సపోర్ట్ తో పూర్ణిమ
గురించి బాధలేదు కానీ వైభవ్ దేవుని దయవలన
మీకు, అల్లుడు, అయితే ,మాగురించి ,ముందే మీకు
చెప్పాలి అని అనిపిఃచింది ..‌అందుకే బెరుకు
వదిలి మీతో చెపుతున్నా..........!!
ఇంకా మీకే వదిలి పెడుతున్నా పెద్ద మనసుతో
మీరేమి చెపుతారో చెప్పండి సార్ అని కుసుమ
అనగానే అప్పటిదాకా ఓపికగా వింటున్న
పరశురామ్ ,కళ్ళలో, నీళ్ళు, సుడులు తిరగగా
అమ్మా ,కుసుమా (సశేషం)...................‌!!

కామెంట్‌లు