"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 73,వ,బాగం)- "నాగమణి రావులపాటి "
 కుసుమ చెప్పిన మాటలకు పరశురామ్ గారి
కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి...
కుసుమా నీవు అసమాన్య ప్రజ్జావంతురాలివి
బంధాలకు బాధ్యతలకు పెద్ద పీట వేసి
ఆహ్వానించావు...........!!
నీ కృషి పట్టుదల నిన్నింత దానిని చేసింది...
 చిన్న వయసులోనే నీ స్వార్దం నీవు చూసుకోకుండా 
నిస్వార్దంగా నీ ప్రేమను సైతం త్యాగం చేసి నీవు చేసిన పని అభినందనీయం.....!!
రాహుల్ విషయానికి వస్తే ప్రేమిచిన ప్రియురాలు
చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయినా....
ఆమె మీద ప్రేమతో ఎదురు చూపులతో కాలం
గడిపాడే కానీ ఆమెను విడిచి వేరే వివాహం
కలలో కూడా ఊహించలేదు.......!!
అనుకోకుండా నీవు కలవటం నీగురించి అసలు
నిజం తెలుసుకోవటం నీవు కూడా అతనికోసం
ప్రేమను పెళ్ళిని త్యాగం చేయటం  తెలుసుకుని
ఇద్దరూ ఒకే మాటమీద నిలబడటం అతని లోని
మంచితనం  ప్రస్పుటంగా కనిపిస్తోంది......!!
 కుసుమా ఒక విషయంలో  రాహుల్ ను
మెచ్చుకోకుండా వుండలేను...నీకయితే వైభవ్
పూర్ణిమ తోడబుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు
బాగోగులు చూసుకోవటం నీ బాధ్యతగా ఎంచి
నీ ప్రేమను త్యాగం చేయటంలో అర్దం వుంది...!!
కానీ రాహుల్ ఏసంభందం లేకపోయినా కేవలం
నీమీద నిజమైన ప్రేమతో తన జీవితాన్ని నీకు
అంకితం చేయటం నాకు చాలా ఆనందం 
కలుగుతోంది... రాహుల్ గ్రేట్ మేన్... నీవు చాలా
అదృష్టవంతురాలివి. అని అన్నారు పరశురామ్...!!
ఔను సార్ మీరు మమ్మల్ని ఇంతలా అర్దం
చేసుకుంటారు, అని అనుకోలేదు...
అని కుసుమ అనగానే పరశురామ్ గారు
నేను మీకు అండగా వుంటాను ముందు పూర్ణిమ
వివాహం జరిపిద్దాము.వైభవ్ గురించి నాకు
వదిలేయ్.............!!
రాహుల్ కు నీకు ఇద్దరికీ వైభవోపేతంగా వివాహం
జరిపించే పూచీ నాదీ మీరు నిశ్చింతగా వుండండి
మీ బాబాయి గారిని కలిసి మీగురించి చెప్పి
ఒప్పించి పెద్దలుగా నిలబడి మీకు వివాహం
జరిపించుతాం (సశేషం)...............!!

కామెంట్‌లు