"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 74,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 పరశురామ్ గారు కుసుమ చెప్పినదంతా విని పరిష్కారాలు పరిస్థితులు స్థితి గతులు  ప్రణాళికలు
హామీలు దైర్యం అండదండలు అన్నీ కుసుమ కు
పొందుపరిచిన వైనంతో కుసుమ కు ఎక్కడలేని
ఆనందం కట్టలు తెగి ఆనందభాష్పాలతో
పరశురామ్ గారి పాదాలకు ప్రణమిల్లింది....!!
ఆయన కుసుమను ఆశీర్వదించి కుసుమా నీ
శంఖాలు భయాలు తొలగి పోతాయి కదా ఇంక
నిశ్చింతగా వుండు.ఇక మనం పూర్ణిమ వివాహ
సన్నాహాలు చేయాలి అని అన్నారు......!!
సరే సార్ నా హృదయం యిప్పుడు తేలిక పడింది
పదండి మంచి కాఫీ తాగుదాం, అని కుసుమ
అనగానే ఇంకా సార్ ఎందుకమ్మా చక్కగా
మామయ్యా అని పిలవక అని అన్నారు
పరశురామ్ గారు అలాగే మామయ్య గారు
పదండి అని తేలిక పడిన హృదయాలతో
హాలులోకి నడిచారు.........!!
వాళ్ళని చూసి అందరి ముఖాలు విప్పారింది కానీ
అందరి హృధయిలలో ఏమి మాట్లాడారు అనే శంక అలానే మిగిలింది... 
కాలం గడుస్తోంది చూస్తూనే నెల రోజులు గడిచింది
పూర్ణిమకు ఫోన్లు చేస్తూ నవ్వులు కురిపించే వేణు
అనుకోకుండా ఒకరోజు ఇంటిముందు ప్రత్యక్షం
అయ్యాడు ఎవరి పనుల్లో వాళ్ళు హాజరు కావటానికి
రెడీ అవుతుండగా హాయ్ కుసుమా అంటూ
లోపలికి వచ్చాడు.........!!
ఏమిటిరా వేణు చెప్పా పెట్టకుండా వచ్చావు
అని అన్నది  కుసుమ... చెప్పి వచ్చేవాడు బంధువు
చెప్పాల్సిన అవసరం లేనివాడు ఆప్తుడు 
నేనెవరు చెప్పు అని అనగానే మాటల్లో నిన్ను
గెలవగలరా సరే టిఫిన్ చేద్దూగాని రా అని
అన్నది కుసుమ ............!!
ముందు నా డార్లింగ్ ను కలవనీ  తను పెడితేనే
తింటాను అని నువ్వుతూ అనగానే హాయ్ వేణు 
అంటూ వైభవ్ పలకరించాడు...హాయ్ రా ఎక్కడ
నా పుత్తడిబొమ్మ  పూర్ణమ్మ అని అనగానే పూర్ణా చూడు ఎవరొచ్చారో అని పూర్ణిమను పిలిచాడు
వైభవ్...........!!
హలో వేణు నీవు వస్తున్నట్టు ఒక్కమాట కూడా
అనలేదు ఆంటీ అంకుల్ బాగున్నారా అంటూ
పలకరించింది పూర్ణా ... అందరూ కులాసానే...
రావే ముందు ఏం టిఫిన్ చేసారో పెట్టు తింటూ
మాట్లాడుకుందాం అని అన్నాడు వేణు......!!
అక్క ఈరోజు అరటికాయ బజ్జీ చేసింది నేను
తినేసాను నువ్వు తిందువుగాని అని అన్నది
పూర్ణిమ.....నాకోసం కొంచెం తినవే  అని అనగానే
తినకపోతే వదిలేలా లేడు... సరే కొన్ని తింటాలే
పద అన్నది పూర్ణిమ (సశేషం).................!

కామెంట్‌లు