"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 81వ,బాగం)- "నాగమణి రావులపాటి "
 వడి వడిగా వచ్చి రీసీవర్ తీసుకుంది కుసుమ.
హలో రాహుల్ గారు చెప్పండి, మీ నాన్నగారికి
ఎలా వుంది?? అని అన్నది కుసుమ.........!!
కాస్త పర్వాలేదు టైమ్ కి తీసుకు వచ్చారు,
ప్రమాదం తప్పింది,అన్నారు.మరో రెండు రోజులు
హాస్పిటల్ లో వుంచాలని అన్నారు.......
కంగారు పడకు నేను ఇంటికి తీసుకు వచ్చాక
వస్తాను, అని అన్నాడు, రాహుల్.....‌.‌‌.....!!
ఓకే రాహుల్ నాకు చాలా కంగారు వేసింది.
జాగ్రత్త, వుంటాను, మరి అని అన్నది, కుసుమ.
 కుసుమా అని మార్దవంగా, పిలిచాడు, రాహుల్
ఏమిటి చెప్పండి, అని అన్నది కుసుమ.......!!
మన గురించి అదే నీవు కనిపించటం గురించి
మనం పెళ్ళి,చేసుకునే దాని గురించి అమ్మా
వాళ్ళకు చూచాయగా చెప్పాను...వాళ్ళు
ఆనందానికి అవధులు లేవు ఇన్నాళ్ళు ఎందుకు
చెప్పలేదంటే, చెపితే, తొందర ,పడతారు........‌!!
కానీ మన ఒప్పందాలు వారిని బాధించవచ్చు
అందుకే వాళ్ళకు ఏమీ చెప్పలేక పోయాను...
ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది కదా
అందుకే చెప్పాను, అని అన్నాడు ,రాహుల్.....
.
సరే ఇక వుండనా, అని అన్నది కుసుమ......
ఆగు నీకొక విషయం చేప్పాలి,అని రాహుల్ అనగానే
ఏమిటో ఆవిషయం, చెప్పండి అని కుసుమ
తొందర చేసింది.నీవు పూర్ణా పెళ్ళి సుభలేఖలు
తీసుకుని రా, మన, ఇంటికి, అని అన్నాడు, రాహుల్.!!
మన ఇల్లు అని రాహుల్, అనగానే కుసుమ కు
హౄధయం  ఉప్పొంగింది...ఏదో తెలియని
తీయని అనుభూతి.మనసును నింపేసింది...
తలపులు ఊయలలు ఊగుతున్నాయి.....
కుసుమా వింటున్నావా అని రాహుల్ అనగానే
ఆ వింటున్నిను అని యాంత్రికంగా చెప్పింది.
కుసుమ (సశేషం)...............!!

కామెంట్‌లు