"కాయాకష్టము"-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.

తే.గీ.
కష్టపడిపనిజేసినకడుపునిండు
కష్టపడువాడునెప్పుడునష్టబోడు
కష్టమునుపొందిసుఖమునునిష్టపడుము
కష్టకాలమునోర్చినకలలుపండు!!!

02.
తే.గీ.
పుట్టినప్పటినుండియుగిట్టువరకు
రెక్కముక్కలుజేసియురేయిపవలు
కష్టపడియున్నతినిపొందికష్టజీవి
ముదముతోడజీవితమునముందునిల్చు!!!

03.
తే.గీ.
కష్టమోనష్టమైననుకష్ఞపడుట
మానవలదనిజెప్పిరిమాన్యులిచట
శ్రమపడివిజేత‌యైనిల్చిచరితకెక్కె
"ఏ.పి.జేఅబ్దులుకలాము"నెపుడుదలుతు!!!కామెంట్‌లు