పిచ్చి డాక్టరు;-డా.నీలం స్వాతి, -చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961
 డాక్టరు గారూ...
విషపూరితమైన పాము కాటు వేసింది మా వాడిని అంటే,
ఖంగారు ఎందుకు పడుతున్నావ్ అంటాడు...
మా వాడి కిడ్నీలు రెండూ పోయాయండీ డాక్టర్ అంటే 
పర్వాలేదులే అంటాడు....
కూరగాయలు కోస్తూ వేలు తెగింది డాక్టర్ అంటే  
10 కుట్లు అయినా వెయ్యాలి అంటాడు....
కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ అంటే 
పగలబడి నవ్వుతాడు...
మంచి మందులు రాయండి డాక్టర్ అంటే 
ఓం... హీమ్ అంటూ మంత్రాలు చదువుతాడు...
వైద్యం చేయడం అసలు రాకపోయినా సరే మా పిచ్చి డాక్టరు...
అన్నీ తెలిసినట్లు నటించడంలో మాత్రం మహా గొప్ప యాక్టర్...


కామెంట్‌లు