అందుకో మిత్రమా ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు. 6302811961
 అందని ఆకాశమంత ఆ కొండలను 
చూసి నువ్వు బెదరకోయి...
తలచిన ఆశయాలను మధ్యలోనే
వీడుట నీకు వలదోయి...
లక్ష్య సాధనలో వెనుతిరుగుట కన్నా 
వీరమరణం చాలా గొప్పదోయి...
సంకల్పాన్ని వీడి కూర్చొని నువ్వు 
కదలనంటే చాలా కష్టమోయి...
తెగించి సాగిన మన పయనం
ఈ నెత్తుటి గాయాలను చూసి ఆగదోయి...
చెంత నేనుండగా ఆగని కడలై 
సాగుతున్న ఆ కన్నీరు నీకు ఎందుకోయి…
వెలుగుకు దుప్పటి కప్పూతూ 
మనను ముసిరేలోపు ఈ రేయి...
ఇద్దరం ఒక్కటై లక్ష్యాన్ని సాధిద్దాం అందుకో 
మిత్రమా నా చేయి...


కామెంట్‌లు