బాహ్య సౌందర్యం బాగోలేదట అందుకే ఆమె బెంగపెట్టుకుంది...
ప్రపంచంలో తన రంగొక్కటే వెలిసిపోయిందట
అందుకే కుంచెతో ఆకృతికి రంగులద్దే పనిలో పడింది...
దేవుడిచ్చిన దానితో
తనకు సంతృప్తి లేదు
అందుకే అందానికి
మెరుగులద్దడం ప్రారంభించింది...
కలతంతా తీరిపోయెలా,
ఊహలకు ఊపిరి పోస్తూ
కాగితాన్ని పట్టుకొని తన
రూపాన్ని తానే గీసుకుంది...
కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ
ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీల సాయాన్ని కోరింది...
నచ్చని వాటిని
నచ్చినట్లుగా
మార్చుకుంటూ అసలు రూపాన్ని ఆనవాలు లేకుండ దాచేచింది...
తానేనా అన్న సందేహంలో
తనువంతా తడుముకుంటూ
తానెంతో మురిసిపోయింది...
కృత్రిమ సొగసుతో అసలు అందాన్ని విడిచి, తాను
అందగత్తెగా మారాక
అద్దంలో ఆమె అందం రెట్టింపయింది...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి