స్ఫూర్తి చిహ్నాలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు....
ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు....
ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను ఎదురుకుంటున్న సమస్యలు సవాలక్ష...
ఆలోచనలకు స్వేచ్ఛ లేదు,
ప్రయత్నాలకు ప్రోత్సాహం లేదు...
As a woman we are struggling a lot 
To won our dreams
To won your support....
సమయం సమాధాన పరచడం లేదు అందుకే సమస్యలను లేవనెత్తవలసిన దుస్థితి...
మౌనం పరిష్కారాలను చూపడం లేదు అందుకే
ప్రశ్నలను సంధించే పరిస్థితి....
స్వాతంత్రం కోసమే కాదు, 
సమానత్వం కోసం కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి....
కేవలం న్యాయం కోసమే కాదు 
అవకాశాల కోసం,
గుర్తింపు కోసం, 
హక్కుల కోసం, 
బాధ్యతల కోసం
పోరాటాలు ప్రారంభమవుతుంటాయి...
చరిత్రలో విజయాలది మాత్రమే కాదు 
ప్రయత్నాలది కూడా సమాన స్థానమే... 
అందుకే మా కోసం మేము యుద్ధాన్ని ప్రారంభించాము....
అయితే ప్రతిపాదనలల్లో "కోరుకుంటూ" అంటూ  సరిపెట్టుకోలేదు....
We deserve love
We deserve care
We deserve happiness
We deserve freedom
Most importantly
We deserve respect....
We deserve everything that we dream 
అంటూ
నిలదీసి నేడు ఈ స్థాయిన నిలుచున్నాను....
ఎందరికో ఆదర్శంగా,
మరెందరికో స్ఫూర్తిగా 
ప్రతి రంగంలో మాదైన ముద్రను వేస్తూ చరిత్రలో మాకు కొన్ని పేజీలను సృష్టించుకున్నాము....
మరెన్నో కొత్త ప్రయత్నాలకు నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నాం...
Don't stop our way....we want to became torch bearer for our next generation...to make their lives easy....to make their lives happy💛


కామెంట్‌లు