దూరమైన తెలుగు;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నవనాగరికం అమ్మ నాన్న అంటూ ఆప్యాయంగా పలికే పెదవుల పదాల కంచెలను తెంచిందా
మారుతున్న సంస్కృతి మమ్మీ డాడీ అన్న పదాల మీద మోజు నీకు పెంచిందా...
పలక పై దిద్దిన ఓనమాల ఒరవడి నే నీకు పనికిరానంటూ పొమ్మందా
ఖరీదైన ఇంగ్లీష్ కాన్వెంటు పరుగులు తీసి తన వైపుగా నిన్ను రమ్మందా...
పరీక్షలలో ఫలితాన్ని చూపలేనంటూ తెలుగు భాష తలదించి తగ్గిందా...
అయిదారు సార్లు చదివినా అర్ధంకాని ఆ ఆంగ్ల భాషే అన్నిటిలో నెగ్గిందా...
ఏళ్ళు గడుస్తున్నా గద్దె దిగక  ఆంగ్లం అగ్రస్థానంలోనే నడిచిందా... 
పరబాషల వెల్లువలో మన భాష మౌనంగా ఒంటరై నిలచిందా...
మమతలతో మమేకమై సాగే మన దేశంలో ఎటు చూసినా
మన మాతృభాషే కరువయిందా...
ఏదో అరకొర ఆశయాలను అందుకోవాలన్నా సరే, 
చివరకు ఆ ఆంగ్ల బాషే మనకు అరువయిందా...


కామెంట్‌లు