సినీ జగదేకవీరుడు ;-చైతన్య భారతి పోతుల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హైదరాబాదు 7013264464
పసందైన విరితేనెల పాటలతో మనసుదోచే 
సినీ తోటలో జగదేక వీరుడు సినారె 

వేయి వసంతాల సమాగమ సంబరం 
పరిమళాలు వెదజల్లే హృదయ గీతాలు 

కమ్మని కవితామృతాన్ని తాగించి 
కమ్ముకున్న కాటుక చీకట్లను తరిమేసే.

ప్రతి పాటను ఎదలోతుల్లోకి చొప్పించి 
అంబర వీధుల్లో విహరింపజేసే సినారె.

హరికథా పునాదుల సమ్మేళన శిష్టకవి 
ఛందో లయ నిర్మాణపు గాయకమణి. 

పంచపదుల నేరి కూర్చిన మణిహారం 
ప్రపంచపదుల ఛందో వైవిద్య సాహసం.

సాహితీ జగత్తులో విశిష్ట ప్రయోగం 
లోకానికి చురకలు పెట్టే సాక్షీ సత్యాలు. 

తాత్విక సందేశాల గజళ్ళ గుబాళింపు 
స్వీయగానామృత లయజలపాతాలు.

జ్ఞానపీఠ గౌరవమే హారతి పట్టే 
విశ్వంభరాన్ని లోకానికెరుక పరిచి 

అభ్యుదయానికి అగ్రపీఠమేసి, 
పురస్కారాలతో జన్మ పునీతమయ్యే. 

తెలుగు వారి కీర్తి సుమాలను 
విశ్వమంతా వెదజల్లెను సినారె.


కామెంట్‌లు