స్నేహగంధం ;-చైతన్య భారతి పోతుల 7013264464
పసిప్రాయము 
చిరుస్నేహము 
చిగురించును 
వికసించును.

ఎదఎదకు 
విజయాలకు 
జట్టుకట్టరా!
సాగుదామురా!

ఓడనిబంధం 
శాశ్వతగంధం 
స్నేహసుమము 
నిల్పుకుందాము.

మచ్చలేనిది 
స్వచ్ఛమైనది 
దృఢబంధము 
ఆత్మబంధము.

కష్టనష్టాల్లో 
తరగనిది 
దైవపెన్నిధి 
స్నేహసన్నిధి.

దైవత్రయము 
త్రివిధదళo 
త్రివర్ణస్నేహం 
మిత్రత్రయము.


కామెంట్‌లు