అందం ;-ఎల్. లాస్య;-9వ తరగతి,-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్, సిద్దిపేట 9542146280
 సిమ్హాద్రిపురం అనే గ్రామంలో, ఒక చిన్న ఇంట్లొ రాజయ్య అనే తాతకి ఇద్దరు మనవరాల్లు జన్మించారు. కాని రాజయ్యకు ఒక చిన్న లోటు ఉండేది. మొదటి మనవరాలి పేరు ప్రియ తను చాల అందంగా ఉంటుంది. రెండవ మనవరాలి పేరు మధు. తను చాల నల్లగా ఉంటుంది. అందరు ప్రియని అందంగా ఉందని మెచ్చుకుంటారో మధు నల్లగా ఉందని ద్వేషించేవారు.
    మధుకి ఆడుకోవాలన్న కొరిక ఉండేది. అప్పుడు వాల్ల స్నేహితురాల్ల దగ్గరకు వెల్లి, 'నేను కూడ మీతో ఆడుకోవచ్చా'అని అడిగింది. అప్పుడు వాల్లు ఏమన్నారంటె, 'నువ్వు చాల నల్లగా ఉన్నవు. నువ్వు మాతో ఆడకుడదు' అని వెక్కిరించారు. అప్పుడు తాను ఎంతో బాధపడేది. కాని తను పెద్దగా పట్టించుకునేది కాదు. తాను అనుకొనేది, "ఈ లోకంలో నాలాగా ఎవ్వరు లేరని" అందరకు తెలియని విషయం ఎమిటంటె, ప్రియ అందంగా ఉన్నాననే పొగరుతో ఉంటుంది. మధు అందరితో స్నేహాభావం, ప్రేమ కలిగి ఉండేది. ప్రియ ఎప్పుడూ అద్దంలో చూసుకుంటు, తనకు తాను అందంగా ఉన్నాననే ఊహించుకునేది. తను అప్పుడు సౌందర్య చందనాలు వాడుతూ ఉండేది.
      ప్రియా ఎప్పుడు మధుని నల్లగా ఉందని వెక్కిరించేది. కాని మధు అవన్ని పట్టించుకోకుండా తనపై కోప్పడకుండా ఉండేది. ప్రియ తనకంటే చిన్నదని అహంకారం, పెద్దరికం చుపించేదికాదు. చూస్తు చూస్తునే 
వాల్లు పెల్లీడికి వచ్చారూ. రాజయ్య ఎమనుకున్నాడంటే, "నా మనవరాల్లు పేద ఇంట్లొ పెరిగారు. కాబట్టి వాల్లని ఏలోటు రాకుండా ధనవంతుడికిచ్చి పెల్లి చేయాలి అనుకొన్నాడు.
    ఆ సమయంలో ఆ గ్రామమానికి చెందిన రాజు సైనికులు "ఈ ఉరికి రాజు వీర్రాజు కుమారుడు ఇంద్రరాజుకోసం స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సిద్దంగా ఉన్నవారు రేపు రాజ్యభవనానికి రావలసిందిగా ప్రకటన"అని ప్రకటిస్తారూ. అప్పుడు రాజయ్యా వారి మనవరాల్లు విని వాల్లు కూడా రాజ్యభవనానికి వెల్లాలని సిద్దపడతారు. ప్రియ ఎంతో అందంగా తయారూవుతుంది. మంచి గౌను వేసుకుంటుంది. మధు మాత్రం ఎప్పటిలాగే తయారవుతుంది.
        వారు నడుచుకుంటూ రాజ్యభవనానికి వెల్లారు. రాజ్యభవనం చాల పెద్దగా ఉంది. లోపల ఎంతో అందంగా ఉంది. అందరు మధుని వింతగా చూస్తున్నారు. అందరు ఏమనుకునారంటే, "తనైతె మామూలు గౌను ధరించింది. తనకు రాజు భార్య అయ్యే అవకాశం లేదు"అని అనుకొన్నారు. అప్పుడు వీర్రాజు ఇంద్రరాజు ఇద్దరు వచ్చారు. వాల్లపై పువ్వుల వర్షంకురిసింది. అప్పుడు ఇంద్రరాజు ఎమన్నాడంటే, "మీరందరూ నన్నే ఎందుకు పెల్లిచేసుకోవాలనుకుంటున్నారో కారణం చెప్పండి. ఈ ప్రశ్నకు ఎవరైతే సరైన జవాబు చెబుతారో వారినే నేను పెల్లిచేసుకుంటాను అని చెప్పాడు. అక్కడ ఉన్నవాల్లందరు అశ్చర్యపోయారు రాజు ఎందుకిలా అన్నాడని.ఇంత చిన్న ప్రశ్నకు జవాబానని.
 చాల మంది నీ దగ్గర ఎక్కువ ధనం అందుకె నిన్ను పెల్లిచేసుకుంటానని.అప్పుడు ప్రియ వచ్చి ఏమన్నడంటే, "నన్ను చేసుకోయేవాడు నాకంటే అందంగా నాకంటే ఏక్కువ డబ్బు ఉండాలి"అని చెప్పింది. మధు సమయం వచ్చింది తను చెప్పింది, "నన్ను పెల్లి చేసుకోబోయెవాడు నాకంటే అందంగా ఉండేవాడు, ధనవంతుడు,ఆస్తి ఉన్నవాడు కాదు. నాకంతే మంచి మనసున్నవాడు, దయతోఉన్నవాడు కావాలి అని చెప్పింది. అప్పుడు రాజు,"నాకు కావలసిన సరైన జవాబు ఇదే. డబ్బుతో, అందంతో మనం మనసులు గెలవలేం. అదే మంచి మనసువుంటే ఎందరి మనసులైనా గెలుచుకోవచ్చు. నాకు తగిన రాకుమారి తినే!"అని చెప్పాడు. మధు ఎంతో సంతోషపడింది.
      ఇంత నల్లగా ఉన్న అమ్మాయినే ఎందుకు పెల్లిచేసుకోవాలనుకుంటున్నావ్ అని అడిగితె, రాజు ఎమన్నాడంటే, తను నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలా ఉన్నా మంచిమనసుంది. మనిషి అందం కేవలం మంచి మనసుమాత్రమే గుర్తిస్తుంది. ఈ విషయం అందరికి అర్దమయ్యేటట్లుగా రాజు చెప్పాడు.
మధు స్నేహితురాల్లు తన దగ్గరకు వచ్చి, క్షమించు మధు మేము చాల తప్పుచేసాం. రాజు గారు చెప్పేదాక మాకు అర్దంకాలేదు.

        చూడండి ఈ కథ ద్వార మనకి అర్ధమయ్యింది ఎమిటంటే, "మనుషుల అందం వాల్ల రంగు కాదు వాల్ల మంచి మనసు.
           
==================================
డా. సిద్దెంకి   944124473


కామెంట్‌లు