బొమ్మల పెళ్లి ;-సమ్మోహనాలు (ముక్త పదగ్రస్థం )(900-908)-ఎం. వి. ఉమాదేవి
బొమ్మలకు పెళ్ళంట 
పెళ్లి ముచ్చటయంట 
ముచ్చట్లు బాల్యాన జ్ఞాపకo ఓ వనజ !

సెలవురోజున ఆట 
ఆట ఆడిన చోట 
చోటనే ఏర్పాట్లు మొదలెట్టు ఓ వనజ !

అమ్మనే అడిగేరు 
అడిగి సాధించేరు 
సాధించి సరుకులని ప్రతియింట ఓ వనజ !

రంగు రంగు బట్టలు 
బట్ట మిగులు ముక్కలు 
 ముక్కలడిగి దర్జీని  తెచ్చిరి  ఓ వనజ !

పందిరి అన్న వేయు 
వేసి ఆకులు కోయు 
ఆకులను విస్తళ్ళు వాడేరు ఓ వనజ !

పప్పు బెల్లం ముక్క 
ముక్క విందుకు చక్క
చక్కగా భోజనం పెట్టేరు ఓ వనజ !

ముస్తాబు వధూ వర 
వరమమ్మ చేయునుర
చేసి మురిపెం గాను బుగ్గ చుక్క ఓ వనజ !

ఆమె బాల్యం గురుతు 
గురుతుతో తన వంతు 
వంతుగా సాయపడి సలహాలు ఓ వనజ !

పిల్లలే పెద్దలుగ
పెద్దవి సందడులుగ
సందడిగ చదివింపు లడిగేరు ఓ వనజ !!


కామెంట్‌లు