మానవ జీవితంలో 'గురువు' విశిష్టత ;-సాహితీ సేవారత్న అవార్డు గ్రహీత " కావ్యసుధ "సీనియర్ జర్నలిస్ట్, (విశ్రాంత )9247313488 : హైదరాబాదు
 భగవంతుని చేరటమనేది మానవునికి అంత సులభమైనది కాదు దానికి ఎంతో సాధన
కావాలి. జపం, తపం చేసినంత మాత్రాన భగవంతుడు మనకు ప్రత్యక్షమవ్వుడు. మనం చేసే పూజ ఒక విత్తనం నాటడం వంటిదే, ఆ విత్తనం భూమి పొరలను తొలచుకొని పొటమరించి, పెరిగి వృక్షమై ఫలాలను అందించాలంటే. తగిన పోషణ అవసరం. అందుకు నీరుపోసి, ఎరువువేసి జాగ్రత్తగా. పెంచడానికి అవసరమైనప్పుడు అనుభవజ్ఞుల సలహాలు ఎలా అవసరమో అలాగే మనం భగవంతుని చేరేందుకు కూడా అంతే ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నాలు ఫలించాలంటే మార్గ దర్శకత్వం అవసరమవుతుంది. మార్గం చూపేవాడే 'గురువు'. అందుకు ఉదాహరణ వివేకానందుడికి రామకృష్ణ పరమహంసవంటి 'గురువు' లభించడమే
ఎంతటి వారికైనా గురుదేవుని ద్వారా మంత్రోపదేశము పొంది. అజ్ఞానాంధకారమును వదిలి జ్ఞానజ్యోతిని వెలిగించుకొన్నంతనేగాని. భూషత్ సాక్షాత్కారము లభించదు. గురు కటాక్ష వీక్షణతో సర్వ విద్యలు వాటంతటనే వచ్చి వర్షిస్తాయి. అందువల్లనే గురుదేవుని భగవంతుని స్వరూపంగా భావించి, 'ఆచార్యదేవోభవ' అని స్తుతించారు.
ఈ మానవజన్మ ఎంతో ఉత్తమమైనది. అట్టి జన్మనుమనం సార్ధకం చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. జీవించడానికి జీవనోపాధి, తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు ఎంత ముఖ్యమో ఆదర్శప్రాయమైన జీవితానికి గురువుకూడ అంతే ముఖ్యం. ప్రతివారికి తొలి గురువు తల్లి, విద్యాభ్యాసం చేయునప్పుడు విద్య నేర్పు గురువు, జీవిత పరమావిధిని గూర్చి తెలుసుకొని ఉత్తములుగా జీవించుటకు తప్పని సరిగా సత్- త్సాంగత్యం. సద్గురువు యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది. మనం చేసే ప్రతిపనిలోనూ చక్కని అవగాహన, సహకారాలను అందించే గురువు. మనకు లభించినప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. సద్గురువు అంటే బట్టలుతికే వ్యక్తి వంటివారని, మలిన వస్త్రాలను అతను ఏరకంగా శుభ్రపరుస్తాడో అలాగే 'గురువు' అజ్ఞానమనే మలినాన్ని పోగొట్టి ' జ్ఞాన 'మనే వెలుగును అందిస్తారని పెద్దల ఉవాచ.
ప్రతి ఒక్కరి లక్ష్యం జ్ఞానోదయం, కాని ఆ విషయం అర్ధం. చేసుకోలేనంతగా మన చుట్టు పలురకాల మోహాలు అవరించి ఉన్నాయి. ఆ మోహ బంధాలను భేదించుకోవటం అంత సులభమైన పని కాదు జ్ఞాన మార్గాలను చూపే గురువులను మనమే వెతుక్కోవాలి. సద్గురువును ఆశ్రయించి వారి బోధనలు పన్ని తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను యెవరైతే సవరించుకుంటారో వారి జీవితం మారి పోతుంది. జ్ఞానం వలన అహంకారం పోతుంది. భక్తి వలన మమకారం నటిస్తుంది.
మన సాంప్రదాయంలో గురువుకు అత్యుత్తమ స్థానం ఉంది. "గురుబ్రహ్మ గురుర్విష్టు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. సద్గురువుల తపస్పాధనతో రూపుదిద్దుకున్న సనాతన సంస్కృతి మనది. గురువు సంప్రదాయానికి అతీతుడు. గురువు తన మహత్త్వంచేత, అనుగ్రహం చేత మనకు జ్ఞానదానం చేస్తాడు.
మానవ సమాజంలో గురువు యొక్క స్థానం అత్యంత ఉన్నతమైంది. సద్గురువును, తల్లిదండ్రులను, దేవతలను భక్తి ప్రపత్తులతో గౌరవిస్తుంది భారతీయ సంస్కృతి. 'గురువు 'అనగా 'గు' అజ్ఞానాంధకారాన్ని, 'రు' అనగా నాశనం చేయువాడు. అజ్ఞానాన్ని తొలగించేవాడు సద్గురువు, మానవ జీవితంలో జ్ఞానాన్ని మించిన సంపద లేదు. జ్ఞానం నుండే ఆనందం. మానవ జీవిత సార్ధక్యానికి మూలం జ్ఞానమే. జ్ఞానహీనుడు పశువులాంటి వాడని సుభాషిత కారుడు "జ్ఞానేన హీనః పశుభిస్సమానాః" అన్నాడు.
ఈ సకల చరాచర సృష్టికి గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. తల్లిదండ్రులు జన్మకారకులైతే, గురువు మనో చైతన్య వికాసానికి, ఋజువర్తనకు మార్గదర్శకుడై మనిషిని పరిపూర్ణ  మానవునిగా తయారు చేస్తున్నాడు. సమాజంలో నిర్భీతిగా జీవించడానికి గురుదేవుల అనుగ్రహం ఎంతో దోహదపడుతుంది.
            "యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కవితాప్పరాః ప్రకాశం తే మహాత్మానః" అంటే పరమాత్ముని ముందుక ఎటువంటి భక్తి భావం గలదో, గురు మహాత్ముని యందు కూడా అంతటి భక్తి తన్మయతనే చూపాలి. గురు మహిమ ఎంత గొప్పదో, విలువైనదో, అంత ఉన్నతమైనదని, అంత ఉత్కృష్టమైందని తెలుస్తోంది. గురు అనుగ్రహం లేనిదే స్వతహాగా మానవునికి తనకు తానుగా బాహ్యావ్యామోహంలనుంచి తప్పించుకునే దృఢచిత్తం అలవడదని, పరాశక్తి పద సన్నిధానం చేరుకోవాలంటే గురు శుశ్రూష ద్వారా గురువు అనుగ్రహం పొందాలని వేదమాతం __రదాదేవి ప్రవచించినది. మానవ జీవితంలో గురు శుశ్రూష ద్వారానే ఆత్మజ్ఞాన సంపన్నులై ముక్తిని పొందుతారు.
భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక ఉన్నతస్థానం . ఉన్నది. గురువు అంటే సాక్షాత్కరించిన పరబ్రహ్మ. అజ్ఞాన అంధకారాన్ని పోకార్చే జ్ఞాన భాస్కరుడు, గురువు జ్ఞాన దీపం వెలిగించి నూతన జీవితం ప్రసాదించి మోక్షమార్గాన్ని చూపుతాడు. పూర్ణిమకు, పరిపూర్ణుడైన గురువుకు అవినాభావ సంబంధం ఉన్నది. షోడశ కళాపూర్ణుడైన చంద్రుడు పూర్ణిమనాడు వెలుగు విరజిమ్ముతాడు. అట్లాగే శిష్యుడు తనలా మారాలని, గురువు జ్ఞానాగ్నిని హరించుకుని, శిష్యుల హృదయాల్లో వెన్నెల వెలుగు నింపుతాడు. అందుకు శిష్యుడు తన అహంకారాన్ని గురువు పాదాల దగ్గర సంపూర్ణంగా ధార పోయాలి.
-----------------------------------------------------
13-07-22 న గురు పౌర్ణమి సందర్భముగా చిరు వ్యాసం ప్రచురణార్థం


కామెంట్‌లు