భగవంతుడికి ఇష్టం పుష్ప పూజ;-"సాహిత్య శిరోమణి " "కావ్యసుధ "9247313488, హయత్ నగర్

 సర్వ సృష్టికారకుడు, సర్వాభీష్టప్రదాత, కొండలంత వరములు కోరగానే ఇచ్చే సర్వాంతర్యామికి మానవులమైన మనం ఏమివ్వగలం? సూర్యుని ముందు దివిటీలా మనం ఎం ఇచ్చినా, ఎంత భవాన్ని రామలుగా సమర్పించినా అది ఆయనకు అత్యల్పం. అన్నీ ఆయనే అయినప్పుడు, అంతా ఆయన సృష్టి అయినపుడు అత్యల్పులమైన మనం ఏం ఇవ్వగలం?
 నిజానికి ఈ ప్రపంచంలో మనది అంటూ ఏదీ లేదు. మనది ఏదీ కాదు. మరి ఆ సర్వేశ్వరుడి ముందు మనం ఎలా విలవాలి! దోసిలిలో ఏం తీసుకొని ఆయనను కొలవాలి!
దానికి సమాధానం ఆయనే చెప్పాడు. "పత్రం పుష్పం ఫలం తోయం,మోమే భక్త్యా ప్రయచ్చం"అన్నాడు.
గీతలో. వారి వారి శక్తినిబట్టి పత్రాన్ని గాని, వుష్పాన్ని గాని, ఫలాన్ని గాని చివరకి తోయం నీటిని గాని సమర్పిస్తే చాలు అన్నాడు. అయితే ఆ సమర్పించడం సభక్తికంగా చేయాలి. నిండు మనస్సుతో భక్తి తప్పు. భగవంతుడు తప్ప, మరే అన్య ఆలోచనలేని మనసుతో  సదుర్చించాలి. దాన్ని ఆయన తప్పక స్వీకరిస్తాడు. మనసే పుష్పాన్ని చేసి దాన్ని ఆయన పాదాల మ్రోల ఉంచగలిగితే ముక్తినే ప్రసాదిస్తాడు. - పుష్పాలు ప్రకృతి మనకు ప్రసాదించిన వర్గాలు. రకరకాల వర్ణాలతో పరిమళాలతో పుష్పాలు
మనకు లభిస్తున్నాయి. ఒక్క రోజు జీవనం గల పుష్పాలు అన్నీ కలసి మాలగామారి మధుసూదనుని కంఠాన్ని
అలంకరిస్తున్నాయి. వివిధ వర్ణాల మానవులారా !  మీరూ మాలా కలిస్తే, రాగద్వేషాలు విడిస్తే పరమాత్ముని ఎదలో
స్థానం లభిస్తుంది అని చెప్పక చెపుకున్నాయి పుష్పాలు. ఎంత పేదవారికైనా అతి చౌకగా లభ్యమయ్యేది పుష్పాలే.
పుష్పపూజ భగవంతుడికి చాలా ఇష్టం.⚜️

కామెంట్‌లు