అతడే విశ్వంభరుడు;-" రస స్రవంతి " & "కావ్యసుధ "9247313488:హైదరాబాద్.
సాహిత్యం తన దేహమైతె 
సృజనయే తన దాహమైనది
పఠనమే తన ప్రాణమైతె 
వ్రాత తన వ్యామోహమైనది

ఆశలే ఆశయములైనవి
అక్షరాలాధారమైనవి
అతడే డాక్టర్ సినారె
అమరుడైన డాసినారె

పలుకులేమో పాటలైనవి
పల్లవులు సయ్యాటలైనవి
భావములు సంద్రాల అలలై
ఆకసమ్మున కెగసి పడినై

అతడే విశ్వంభరుడు
అమలమౌ శేముషీధరుడు
మధుర ఊహల జలంధరుడు
కల్పనామృత సాగరుండు

అతడే డాక్టర్ సినారె 
అమరుడై దివికేగినాడె
అనేది మా  -  దిగులు
అనునిత్యం రాత్రింబగలు.కామెంట్‌లు