వీరబ్రహ్మేంద్రస్వామి*;-మమత ఐలకరీంనగర్--9247593432
క.
బనగానపల్లె చరితకు
నిలువెత్తు నిదర్శనమున నిక్కము దెలపన్
ఘనమైన మహిమజూపగ
పనిగోరెను నచ్చమాంబ పశువుల నేలెన్

క.
గోవుల గాసెను బ్రహ్మము
దీవికి దరిదాపునున్న దివ్య స్థలమునన్
కావలి బెట్టెను కర్రను
గోవులు యెడబాయకుండ గుండము గీసెన్


కామెంట్‌లు