వీరబ్రహ్మేంద్రస్వామి;-మమత ఐలకరీంనగర్9247593432
 ఆ.వె
అచ్చమాంబ యింట యడుగిడి బ్రహ్మయ్య
కొలువు జేయుదునని కోరె తనను
మొరటుపనులివి యని మురిపెమ్ముగా జెప్పె
పేరుమోసినీమె పెద్ద కాపు
ఆ.వె
నచ్చజెప్పి కొలువు నందున బ్రహ్మయ్య
ముచ్చటగను జేరి ముదముతోడ
పసుల దీసుకోని వనమందు జేరెను
రవ్వల గుహ నెంచి రయము తోడ

కామెంట్‌లు