పద్యాలు ; -మమత ఐల-కరీంనగర్-9247593432
 దత్తపది:- శరణు. కరుణ.వరము. స్థరము
(అంశం:-గంగమ్మ)
తే.గీ
*శరణు* శరణమ్మ గంగమ్మ శాంతినొందు
*కరుణ* జూపమ్మ గోదారి కనికరముతొ
*వరము* లిచ్చేటి మాతవు హరునివోలె
*స్థిరము* గా నిన్ను దలతుము చిత్తమందు

న్యస్తాక్షరి:-వ.సుం.ధ.ర పాదాదిలో
తే.గీ
*వ* సుధ గంగమ్మ రాకతో పరవశించి
*సుం* దరమ్ముగా ప్రవహించె సాగునీరు
*ధ* రణిలో పైరు పంటల ధాన్యరాశి
*ర* త్నమైతోచ దేశాన రైతునవ్వు

కామెంట్‌లు