వీరబ్రహ్మేంద్రస్వామి & కక్కయ్య;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
వెతజెందుచు దుఃఖముచే
హతమార్చెద ననుచు బోయి నర్థించంగన్
జతగా గురుబోయి గృహము
సతియని కూర్మితొ పిలవుము చావెవరికనెన్
క.
కులముకు తక్కువ వారని
స్థలమీయని జనులగాంచి; చాటుకు వింటిన్
నిలకడతో గమనించిన
మనిషికి నిలువెల్ల నున్న మణి చక్రములన్

కామెంట్‌లు