పెరిగితే తరుగే;;-చంద్రకళ. దీకొండ,-మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.=చరవాణి : 9381361384
వనరుల అభివృద్ధి మధ్య
వ్యత్యాసం పెరుగు...
ఉన్నవారికీ, లేనివారికీ 
మధ్య యుద్ధాలు జరుగు!

భూమికి భారం పెరుగు...
ఆకలి చావులు అధికమగు...
ఆహార ఉత్పత్తి తరుగు!

ఉన్న కొన్ని అవకాశాలకు 
పోటీ పెరుగు...
జీవనోపాధి లభ్యత 
అయ్యేను తరుగు!

నివాస స్థలాలకై 
అరణ్యాలు తరుగు...
నిలబడే చోటుకు కూడా
వచ్చును కరువు!

రకరకాల కాలుష్యం
విపరీతంగా పెరుగు...
స్వచ్ఛమైన నీరు,గాలికి 
కూడా చోటు కరువు!

లేటు వయసు పెళ్లిళ్లతో...
సంతానం "ఒక్కరు చాలు"
అను నినాదంతో...
ప్రభుత్వ నియంత్రణ చట్టాలతో...
పరిస్థితి కాస్త అగును మెరుగు!!!కామెంట్‌లు