జీవితం ఓ సవాలా!;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
           2.రైతు!

36.రాజంటే రక్షించేవాడు! ఆకలి నుండి రక్షించే రాజువు!
    ప్రపంచం నీ పాదాక్రాంతం!
     జీవితం ఓ సవాలా!

37.వ్యవసాయ యజ్జకర్తవు!
      యజ్ధఫలమహాదాతవు!
 ఇలా నడయాడే దేవదూతవు!
      జీవితం ఓ సవాలా!

38.శ్రమైకజీవన సృష్టికర్తవు!
      వృత్తిప్రవృత్తిల మేళకర్తవు!
  మయామర్మం లేని ప్రవక్తవు!
      జీవితం ఓ సవాలా!

39."అన్నదాత సుఖీభవ!"
      అన్నదాతకు నాన్నవు!
     లోకజీవన ప్రదాతవు!
     జీవితం ఓ సవాలా!

40.ఈ ధాన్యపు గింజలు!
      నీ స్వేదం ఘనరూపొలు!
      పొరతొలిగితే,
              అన్నపూర్వరూపాలు!
     జీవితం ఓ సవాలా!
_________


కామెంట్‌లు