జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
      3.కుటుంబం!
41.మా అమ్మ మాకు రోజూ!
       ప్రసాదం పెట్టి పెంచింది!
     మేము నరులమయ్యాము!
       జీవితం ఓ సవాలా!

42.భార్యాభర్తల మధ్య మాట!
      వయస్సు ఏదయినా,
      " లాహిరి, లాహిరి" పాట!  జీవితాంతం నడిపే స్నేహబాట!
      జీవితం ఓ సవాలా!

43.కాలప్రవాహంలో ,
         రెండు కట్టెలు కలిసాయి!
 కలిసిననాటినుండీ,
 ఐకమత్యంగా వెళుతున్నాయి!
  కలిపిన వాడైనా,
     విడదీయలేడనుకునే జంట!
   జీవితం ఓ సవాలా!

44.జీవితాన ఒకింత కష్టం!
      వెలగడానికి రాయబారం!
     ఆపైన అంతా వెలుగులే!
     జీవితం ఓ సవాలా!

45.జీవితాన దారిద్ర్యం,
                      బహుముఖ్యం!
      ధనానికి అక్కడ నుంచే,
              కౌంటింగ్ ఆరంభం!
      ఆపైన ఇక లేదు,
                  ఇన్నింగ్స్ ఎన్డింగ్!
     జీవితం ఓ సవాలా!
________
         (కొనసాగింపు)


కామెంట్‌లు