అసలైన బలం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
బాల పంచపదులు
==============
1.బుద్ది సద్బుద్ధి కావాలి!
   సతతం ప్రజ్వలించాలి!
  సత్కర్మకి అంకితమవ్వాలి!
   సదా లక్ష్యం చేరుకోవాలి!
  భుజబుద్ధిబల,
             సమన్వయం, రామా!

2.హనుమశక్తి,హనుమయుక్తి!
  చంద్రగుప్తశక్తి,చాణక్యయుక్తి!
  కృష్ణరాయశక్తి,అప్పాజీయుక్తి!
  దమనశక్తి,మహాత్మునియుక్తి!
  భుజబుద్ధిబల,
              సమన్వయం, రామా!

3 మనిషి కుశల బుద్ధి!
   క్రీడారంగం యుక్తితో సిద్ధి!
 రణరంగం యుక్తి విజయలబ్ది!
  జీవనరంగం విముక్తే బుద్ధి!
  భుజబుద్ధిబల,
            సమన్వయం, రామా!

4.కుందేలు సింహానికి,
                       చెప్పిన కథ!
  నక్కబావ,కొంగబావ,కథ!
  కాకి నీరు తాగిన,కథ!
  వేటగాడు, పక్షులు, కథ!
   భుజబుద్ధిబల,
          సమన్వయం, రామా!
________


కామెంట్‌లు